హుజురాబాద్, జనవరి6: ప్రతి వాహన దారుడు రోడ్డు భద్రత నియమాలు పాటిం చాలని పట్టణ సి ఐ తిరుమల్ గౌడ్ వాహన దారులకు సూచించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద జాతీయరోడ్డు భద్రత వారోత్స వాల్లో భాగంగా సోమవారం ట్రాఫిక్ రూ ల్స్‌పై అవగాహన కార్యక్రమంను విద్యార్థు లతో కలిసి నిర్వహించారు. వాహనదారు లకు గులాబీ పుష్పాలు అందజేశారు.
పట్టణంలోని కేరళ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ పాఠశాల విద్యార్థుల సహకారముతో ట్రాఫిక్ రూల్స్‌పై వాహనదారులకు అవగా హన కల్పించామన్నారు. జమ్మికుంట- కరీంన గర్ -వరంగల్ ప్రధాన రహదారిపై హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించ కుండా వస్తున్న వాహనా దారులను ఆపి గులాబీ పూలను ఇచ్చి.. హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించి వాహనాలు నడపాలంటూ అవగాహన కల్పించారు.