జిల్లా రవాణాశాఖ అధికారి శ్రీనివాస్‌రెడ్డి...
కామారెడ్డి (విజయక్రాంతి): వాహనదారులు ప్రతి ఒక్కరు హెల్మెట్‌ను ధరించాలని కామారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. బుధవారం కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం బస్వన్నపల్లి గ్రామంలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు అవగాహన కల్పించడంతో పాటు తల్లితండ్రులకు హెల్మెట్ ధరించడంపై అవగాహన సదస్సు నిర్వహించారు. రోడ్డు మీద నడిచే పాదాచారులు, విద్యార్థులు వాహనాల రాకపోకలు గమనించి అప్రమత్తంగా వ్యహరించాలని, ప్రతి విద్యార్థి తమ కుటుంబ సభ్యులకి హెల్మెట్‌ని ధరించటం వల్ల అరికట్ట కలిగే ప్రమాదాల గురించి చైతన్యపర్చాలన్నారు.
జిల్లా రవాణశాఖ అధికారి కె.శ్రీనివాసరెడ్డి విద్యార్థులని ఉద్దేశించి యస్.పి.ఆర్.కె పాఠశాల బస్వన్నపల్లిలో రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా ప్రసంగించారు. కార్యక్రమ నిర్వహణకి సహాయ సహకారాలు అందించిన పాఠశాల యాజమాన్యంకి, సిబ్బందికి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా మెటార్ వెహికల్స్ ఇన్సెక్టర్ అప్రోజుద్దీన్, మహేష్, భిక్కనూర్ టోల్ గేట్ వద్ద వాహనాలకి రిప్లెక్టివ్ రేడియం స్టికర్స్ ప్రధాన్యతపై వివరించారు. పలు వాహనాలకు రోడ్డు భద్రత ప్రాధాన్యత ప్రచార పత్రాలను వారి అంగీకారంతో వాహనాలకు అతికించారు.