పట్టణ సిఐ తిరుమల్ గౌడ్...
హుజురాబాద్ (విజయక్రాంతి): ప్రతి వాహనదారుడు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని పట్టణ సిఐ తిరుమల్ గౌడ్ వాహనదారులకు సూచించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా సోమవారం ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కార్యక్రమంను విద్యార్థులతో కలిసి నిర్వహించారు. వాహనదారులకు గులాబీ పుష్పాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్డు భద్రతా నియమాలను వాహనదారులు పాటించాలి, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించి వాహనాలు నడపాలని వాహనదారులకు సూచించారు. పట్టణంలోని కేరళ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ పాఠశాల విద్యార్థుల సహకారముతో ట్రాఫిక్ రూల్స్ పై వాహనదారులకు అవగాహన కల్పించామన్నారు.
జమ్మికుంట-కరీంనగర్-వరంగల్ ప్రధాన రహదారిపై హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకుండా వస్తున్న వాహనాదారులను ఆపి గులాబీ పూలను ఇచ్చి.. హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించి వాహనాలు నడపాలంటూ వినూత్నంగా గులాబీ పూలు ఇచ్చి అవగాహన కల్పించారు. విద్యార్థులు ట్రాఫిక్ రూల్స్ వివరించామన్నారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ రూల్స్ నిబంధనల ప్రకారంగా వాహనాలను నడపాలని సూచించారు. అతివేగం అజాగ్రత్తగా నడిపి కుటుంబాలను రోడ్డుపాలు చేయవద్దని, వాహనాల వెంట ధ్రువీకరణ పత్రాలు ఉండాలని, మద్యం సేవించడం ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ కమల, హెడ్ కానిస్టేబుల్ ఓదేలు ఉన్నారు.