calender_icon.png 24 January, 2025 | 11:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతిక్షణం క్యూరియాసిటీని కలిగిస్తుంది

22-01-2025 12:00:00 AM

హీరో సాయిరాం శంకర్ నుంచి రాబోతున్న మరో విభిన్న కథా చిత్రం ‘ఒక పథకం ప్రకారం’. దర్శకుడు వినోద్ కుమార్ విజయన్ ఈ చిత్రాన్ని తన వినోద్ విహాన్ ఫిల్మ్స్, గార్లపాటి రమేశ్ విహారి సినిమా హౌస్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 7న రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో మంగళవారం చిత్రయూనిట్ మీడియా సమావేశాన్ని నిర్వహించింది.

ఈ కార్యక్రమంలో సాయిరామ్ శంకర్ మాట్లాడుతూ... “ఒక పథకం ప్రకారం’ సినిమాలో నాది లాయర్ పాత్ర. అందుకే డైరెక్టర్, నిర్మాత, నేను ఇలా లాయర్ గెటప్‌లో వచ్చాం. ఈ సినిమా క్రైమ్ సస్సెన్స్‌తో ఇంటెన్సిటీ థ్రిల్లింగ్ ఇస్తుంది” అన్నారు. ‘ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్స్ చాలా ఉన్నాయి కదా? మీ సినిమానే ఎందుకు చూడాలన్న ప్రశ్నకు సాయిరామ్ శంకర్ సమాధానం ఇస్తూ.. ‘స్క్రీన్‌ప్లే ప్రతిక్షణం క్యూరియాసిటీని కలిగిస్తుంది.

అందుకే చిన్న కాంటెస్ట్ పెట్టబోతున్నాం. ఇంటర్వెల్ లోపు విలన్ ఎవరో కనిపెతే స్పాట్‌లో పదివేలు ఇస్తారు’ అని చెప్పుకొచ్చారు. నిర్మాత గార్లపాటి రమేశ్ మాట్లాడుతూ.. “ఈ సినిమాకు సాయిరామ్ శంకర్‌గారు ఎంతో కష్టపడ్డారు.

ఈ సినిమా కోసం ప్రాణం పెట్టేశారు” అని అన్నారు. దర్శకుడు వినోద్ విజయన్ మాట్లాడుతూ... “అందరూ ఈ సినిమా చూసి బాగా ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నాను. సాయిరామ్ శంకర్‌గారు ఇందులో చాలా కొత్తగా కనిపిస్తారు” అని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ పిక్చర్స్ బాపిరాజు, కో ప్రొడ్యూసర్స్ స్వాతి, భిన్ను పాల్గొన్నారు.