calender_icon.png 2 February, 2025 | 4:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాదిగలకు ఇంటికో డప్పు ఉండాలి

02-02-2025 01:24:24 AM

  • చరిత్రలో నిలిచిపోయేలా లక్ష డప్పులు, వేల గొంతుల సభ
  • ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ

జనగామ, ఫిబ్రవరి 1(విజయక్రాంతి): మాదిగ బిడ్డలు వీలైనన్ని డప్పులు కొనాల ని, ఇంటికో డప్పు ఉండేలా చూసుకోవాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, పద్మ శ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణమాదిగ పిలుపునిచ్చారు. ఈ నెల 7న హైదరాబాద్‌లో జరిగే ‘లక్ష డప్పులు, వేల గొంతులు’ సభను జయప్రదం చేయాలని కోరుతూ ఆదివారం ఆయన జనగామలో చేతిలో డప్పు పట్టుకొ ని నెహ్రూపార్క్ నుంచి ఆర్టీసీ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు.

అనంతరం ఓ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఇంతకు ముందు జరిగిన సభలను మించి లక్ష డప్పులు, వేల గొంతుల సభ జరుగనుందని, ఇది చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు. భారీ సాంస్కృతిక ప్రద ర్శన ఉంటుందని తెలిపారు.

ఈ సభ విజయవంతానికి నాలుగు వారాలుగా అన్ని జిల్లాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, సన్నాహక సమావేశాలకు తాను కూడా హాజరవుతున్నానని వివరించారు. తమకు అన్ని సామాజిక వర్గాల నుంచి మద్దతు వస్తోందన్నారు.

ప్రతీ గ్రామంలో ఎన్ని డప్పులున్నాయో లెక్క చూడాలని ఎమ్మార్పీఎస్ నాయకులకు సూచించారు. ప్రతీ ఇంటికి ఓ డప్పు ఉండేలా ఏర్పాట్లు చేయాలన్నారు. కార్యక్రమంలో మాదిగ, అనుబంధ సంఘా ల ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.