20-03-2025 12:10:16 AM
వినయ్ కుమార్, శ్రావణి మజ్జరి, అరవింద్ ముదిగొండ, నోమిన తార ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘కాలమేగా కరిగింది’. ఈ సినిమాను మరే శివశంకర్ నిర్మిస్తున్నారు. శింగర మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 21న విడుదల కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అరవింద్ ముదిగొండ మాట్లాడుతూ.. “ఈ సినిమా మా అందరికీ నాలుగేళ్ల కల.
ప్రతి ఫ్రేమ్ ఒక స్టోరీ చెబుతుంది” అన్నారు. హీరో వినయ్ కుమార్ మాట్లాడుతూ..- ‘ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ’ అన్నారు. డైరెక్టర్ మోహన్ మాట్లాడుతూ.. ‘మోస్ట్ పొయెటిక్ లవ్ స్టోరీ మా సినిమా అని చెప్పేందుకు గర్వంగా ఉంది’ అన్నారు. ప్రొడ్యూసర్ శివశంకర్ మాట్లాడుతూ.. ‘అచ్చ తెలుగులో చేసిన స్వచ్ఛమైన ప్రేమ కథ ఇది. దీన్ని సినీప్రియులందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాం’ అన్నారు.