calender_icon.png 30 April, 2025 | 12:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతీ ఉద్యోగికీ పదవీ విరమణ తప్పదు

19-04-2025 10:51:22 PM

జిల్లా ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్ విక్రమ్ కుమార్...

బచ్చన్నపేట (విజయక్రాంతి): బచ్చన్నపేట మండల కేంద్రంలోని ఎస్సీ హాస్టల్ వార్డెన్ రేగొండ నరేందర్ పదవి విరమణ కార్యక్రమం ఘనంగా జరగగా... ప్రతి ఉద్యోగికి పదవి విరమణ తప్పదని, ఉద్యోగం చేసే సమయంలో సేవా భావం... మంచితనం ను ఎల్లప్పుడు గుర్తిస్తారని... జిల్లా సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ డాక్టర్ విక్రమ్ కుమార్ తెలిపారు. శనివారం మండల కేంద్రంలోని శ్రీనివాస గార్డెన్ లో బచ్చన్నపేట ఎస్సీ హాస్టల్ వసతిగృహం వార్డెన్ రేగొండ నరేందర్ పదవి విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు, ఉద్యోగులు, హాజరై వార్డెన్ రేగొండ అనిత నరేందర్ దంపతులను సన్మానించారు. వార్డెన్ గా చేసిన సేవలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన అభివృద్ధి అధికారి రవీందర్, (డిఎస్ పీ) టి. నారాయణ, వార్డెన్ నరేందర్ .ఉపాధ్యాయులు, మీడియా మిత్రులు, కార్యాలయ సిబ్బంది, బంధుమిత్రులు, పలువురు పాల్గొన్నారు.