29-03-2025 12:25:35 AM
కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ వైస్‌ఛాన్స్‌లర్ డాక్టర్ పీవీ నందకుమార్‌రెడ్డి
కుత్బుల్లాపూర్, మార్చ్ 28(విజయ క్రాంతి) : మెడికల్ రంగంలో ఉన్న ప్రతి డాక్టర్ కూడా దేవుడితో సమానం అని, రోగులకు ప్రేమతో వైద్యం అందిస్తే ఎంతటి వ్యాధి అయినా నయం అవుతుందని కాళోజి నారాయణ రావు యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ డా : నందకుమార్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్ బాచుపల్లి లోని మమత అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ హాస్పిటల్ మొదటి ఎంబీబీఎస్ బ్యాచ్ (2019) పూర్తి అయిన సందర్బంగా శుక్రవారం మెడికల్ కళాశాల ప్రాంగణంలో గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై వైద్య విద్య పూర్తి చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్స్, మెడల్స్ అందించారు.
అనంతరం మాట్లాడుతూ చదివిన వైద్య విద్యకీ, చేపట్టిన వృత్తికి న్యాయం చేస్తూ పేదలకు వైద్య సేవలు అందించాలని సూచించారు.మంచి డాక్టర్స్ గా గుర్తింపు తెచ్చుకుని సమాజానికి సహాయకారిగా మెలగాలని తెలిపారు. మమత మెడికల్ కళాశాలకు చెందిన 133 మంది మెడికల్ గ్రాడ్యుయేట్ పట్టాలు అందుకోగా,మమత నర్సింగ్ కళాశాలకు చెందిన 42 మంది నర్సింగ్ విద్యార్థులు గ్రాడ్యుయేట్ పట్టాలు అందుకున్నారు.
కార్యక్రమంలో మమత ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్,మేనేజింగ్ డైరెక్టర్ డా.పువ్వాడ నయన్ రాజ్, కళాశాల డీన్ డా.పీ.హరి కృష్ణ,మెడికల్ సూపరిండెంట్ డా.ఈ.ప్రణీత్ కుమార్,నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డా.శంషాద్ బేగం, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ శశికళ, పేరెంట్స్ తదితరులు పాల్గొన్నారు.