calender_icon.png 12 October, 2024 | 10:04 AM

ప్రతి రంగూ ప్రాణాంతకమే!

01-10-2024 12:00:00 AM

క్యాడ్ బరీ జెమ్స్.. వీటి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఏ కిరాణ షాపులో చూసినా, ఏ బేకరీకి వెళ్లినా దండలు దండలుగా వేలాడదీస్తారు. షాపుకు వెళ్తే పిల్లలకు వీటిని కొనివ్వాల్సిందే.. లేకపోతే వాళ్లు చేసే మారాం మామూలుగా ఉండదు. చాలామంది వీటిని తినడం వల్ల పిల్లల్లో దంత సమస్యలు వస్తాయని చెబుతుంటారు.

కానీ వీటిలో కలిపే అత్యంత డేంజరస్ రంగులు చిన్నారుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. కంటికి ఇంపుగా కనిపించే అందమైన ఇంద్ర ధనస్సు లాంటి రంగుల వెనుక కనిపించని రోగాలను దాగి ఉన్నాయని చెబుతున్నారు. అయితే జెమ్స్ తయారీలో ఉపయోగించే రంగులను పలు దేశాల్లో బ్యాన్ చేశారు.  

జెమ్స్‌లో కలిపే రంగులు..

క్యాడ్ బరీ జెమ్స్ ప్యాకెట్‌లో గులాబీ, ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, నీలం, నారింజ, ఊదా రంగుల చాక్లెట్లు ఉంటాయి. ఈ స్వీట్ చాక్లెట్స్ తయారు చేయడానికి చాలా రంగులను ఉపయోగిస్తారు. ఈ రంగుల వివరాలను ప్యాకెట్ వెనుక స్పష్టంగా ఉంటాయి. జెమ్స్‌లో వాడే రంగులు 171, 102, 133, 124, 127, 122, 132, 110 రకానికి చెందినవి. ఇంతకీ ఈ రంగులేంటి? ఆ నెంబర్లు ఏంటి? వాటితో వచ్చే నష్టాలు ఏంటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

రంగుల వెనుక అసలు కథ..

కలర్ 171

  1. ఇది తెలుపు రంగులో ఉండే టైటానియం డయాక్సైడ్.
  2. ఈ కలర్‌ను యూరోపియన్ యూనియన్ బ్యాన్ చేసింది. 
  3. ఈ రంగుతో డీఎన్‌ఏ దెబ్బతినే అవకాశం ఉంది. 

కలర్ 102 

  1. ఇది పసుపు రంగులో ఉండే టార్ట్రాజైన్.
  2. ఈ రంగును ఆస్ట్రియా, నార్వే దేశాల్లో నిషేధించారు.
  3. పిల్లలో ఆస్తమా, హైపర్ యాక్టివిటీకి దారితీస్తుంది. 

కలర్ 133

  1. నీలం రంగు జెమ్స్‌లో బ్రిలియన్ బ్లూ ఎఫ్‌సీఎఫ్ వాడతారు.
  2. దీన్ని ఆస్ట్రియా, ఫ్రాన్స్, జర్మనీ, స్వీడన్‌లో నిషేధించారు.
  3. ఇది శరీరంలో ఎలర్జీ సమస్యలకు కారణం అవుతుంది. 

కలర్స్ 124, 127, 122

  1. ఎరుపు రంగు జెమ్స్‌లో బొగ్గు చూర్ణం వాడతారు. 
  2. వీటిని నార్వే, అమెరికాలో నిషేధించారు.
  3. పిల్లల్లో ఆస్తమా, హైపర్ యాక్టివిటీకి కారణం అవుతుంది. 

కలర్ 132

  1. ఇది నీలం రంగులో ఉండే ఇండిగో కార్మైన్.
  2. ఈ రంగును నార్వేలో నిషేధించారు.
  3. ఇది పిల్లల్లో మానసిక ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది. 

కలర్ 110 

  1. ఇది పసుపు రంగులో ఉండే సన్‌సెట్ ఎల్లో ఎఫ్‌సీఎఫ్.
  2. ఈ రంగును నార్వేలో నిషేధించారు.
  3. ఈ రంగు పిల్లల్లో మానసిక సమస్యలకు కారణం అవుతుంది.