calender_icon.png 31 January, 2025 | 8:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మానవ హక్కుల పరిరక్షణకు ప్రతి పౌరుడు కృషి చేయాలి

11-12-2024 05:11:56 PM

ఆర్టీఐ మాజీ కమిషనర్ & న్యాయ విద్యాలయ ఆచార్యులు, మాడభూషి శ్రీధర్

మంథని (విజయక్రాంతి): అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం డిసెంబర్ 10 పురస్కరించుకొని మానవ హక్కుల మండలి ఎన్ హెచ్ ఆర్ సి, ఎన్ జిఓ జాతీయ అధ్యక్షులు అయిలినేని శ్రీనివాసరావు అధ్యక్షతన మొదటి జాతీయ సమావేశం జగిత్యాల జిల్లా కేంద్రంలోని లక్ష్మి నరసింహ పంక్షన్ హల్ ప్రాంగణంలో నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా కేంద్ర సమాచార హక్కు మాజీ కమీషనర్&నల్సార్ న్యాయ విద్యాలయం డీన్ మాడభూషి శ్రీధర్ పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమం ప్రారంభమై ఉత్తమ సేవలు అందించిన వారికి సన్మానాలు ప్రశంస పత్రాలు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మనిషి పుట్టుక నుండి జన్మత స్వతగా వచ్చేవి సహజ హక్కులని, మనుషులందరికి సమానంగా హక్కులు ఉంటాయని, హక్కులను ఉల్లఘించకుండా పరిరక్షించడం ప్రభుత్వ బాధ్యత కావాలని, సామాజిక సృహతో హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాడభూషి శ్రీధర్ పిలుపు నిచ్చారు.

అనేక మంది అక్షరంతో పోరాడి హక్కులు సాధించారని అన్నారు. స్థాపించిన 5 మాసల్లోనే తెలంగాణ రాష్ట్రంలో 300 మంది క్రియాశీల సామాజిక కార్యకర్తలు ఉన్నారని, మానవ హక్కుల కార్యకర్త అంటే ప్రభుత్వానికి, సమాజానికి వ్యతిరేకం అనే భావన ఉంటుందని, సమాజంలో రాజ్యాంగ బద్దంగా ఏర్పాటు చేయబడి సమాచార చట్టాన్ని సద్వినియోగం చేసుకొని న్యాయం కోసం పోరాడుతున్నామని జాతీయ అధ్యక్షులు అయిలినేని శ్రీనివాసరావు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ హెచ్ ఆర్ సి, ఎన్ జి ఓ నార్త్ జోన్ అధ్యక్షులు కోరిపెల్లి ప్రశాంత్, పెద్దపల్లి జిల్లా చైర్మన్ మాచిడి దిలీప్ కుమార్ గౌడ్ పెద్దపల్లి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వైద్య శ్రీకాంత్, జిల్లా ప్రధాన కార్యదర్శి మాచిడి కృష్ణమూర్తి, జిల్లా కోఆర్డినేటర్ డి సరిత, ఎన్జీవో పెద్దపల్లి నియోజకవర్గ అధ్యక్షుడు జాడి ప్రభాకర్, మంథని మండల ఉపాధ్యక్షుడు మణెం మనోజ్, స్వచ్ఛంద సేవా కార్యకర్తలు, సేవకులు తదితరులు పాల్గొన్నారు.