25-03-2025 01:14:58 AM
సీడబ్ల్యూసీ మెంబర్, ఏఐసీసీ సెక్రటరీ వంశీ చందర్‌రెడ్డి
కరీంనగర్ క్రైం, మార్చి 24 (విజయక్రాంతి): జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదంతో సంవత్సరం వరకు గ్రామస్థాయి నుంచి జాతీయస్థాయిలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర చేపట్టాలని, యాత్రలో భాగంగా రాజ్యాంగ పరిరక్షణపై ప్రతి పౌరునికి వివరించాలని సీడబ్ల్యూసి మెంబర్, ఏఐసీసీ సెక్రటరీ వంశీ చందర్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. సోమవారం డీసీసీ కార్యాలయంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంపై జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అధ్యక్షతన జిల్లా కాంగ్రెస్ సన్నాహాక సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన వంశీచందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి గ్రామంలో అంబేద్కర్, మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి భారత రాజ్యాంగ పుస్తకం, కాంగ్రెస్ పార్టీ జెండా, అంబేద్కర్ చిత్రపటాలతో పాదయాత్ర చేపట్టాలని కోరారు.
కార్యకర్తల సహకారంతోనే జాతీయ స్థాయిలో చేపట్టిన కార్యక్రమాలలో తెలంగాణ మొదటి స్థానంలో ఉండేదని, రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షులుగా ప్రారంభించిన డిజిటల్ మెంబర్షిప్లో దాదాపు 42 లక్షల సభ్యత్వం చేసి తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందన్నారు. జై బాపు, జైభీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో కూడా తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిపేందుకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, నుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశు, పురుమల్ల శ్రీనివాస్, వాడికెల ప్రణవ్, ఆరెపల్లి మోహన్, నమిండ్ల శ్రీనివాస్, పటేల్ రమేష్ రెడ్డి, వెంకట్రామిరెడ్డి, వైద్యుల అంజన్ కుమార్, పదాల రాహుల్, బొమ్మ శ్రీరామ్, కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, శ్రావణ్ నాయక్, కర్ర సత్యప్రసన్న రెడ్డి, పులి ఆంజనేయులుగౌడ్, ముత్యం శంకర్, గడ్డం విలాస్ రెడ్డి, మునిగంటి అనిల్, మడుపు మోహన్, కొరివి అరుణ్ కుమార్, ఆకారపు భాస్కర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.