calender_icon.png 26 November, 2024 | 6:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతిపౌరుడికీ లబ్ధి

18-05-2024 12:43:18 AM

హరిత భవనాలతో అనేక లాభాలు

తెలంగాణలో గ్రీన్ బిల్డింగులు పెరగాలి

ఇందుకు ఐజీబీఎస్ కృషి అభినందనీయం

గ్రీన్ ప్రాపర్టీ షో ప్రారంభోత్సవంలో మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్‌కుమార్

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 17 (విజయక్రాంతి): రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పడిన ఐదు నెలల్లోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని రాష్ట్ర పరిశ్ర మలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. ప్రతిపౌరుడు లబ్ధి పొందే విధంగా ప్రభు త్వ విధానాలు ఉంటాయన్నారు. నిర్మా ణరంగంలో హరితభవనాలు పర్యా వరణ పరిరక్షణకు ఎంతో ఉపయోగ పడుతాయని అన్నారు. నగరంలోని హైటెక్స్ లో గ్రీన్ ప్రాపర్టీ షోను నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి శ్రీధర్‌బాబు ప్రారంభించారు.

ఐజీబీఎస్ గ్రీన్ ప్రాపర్టీ షో కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వానికి పర్యావరణ పరిరక్షణ పట్ల ఉన్న నిబద్ధతను తెలియజేస్తుందని చెప్పారు. హరిత భవనాలను నిర్మించడంతోపాటు వీటి ప్రాముఖ్యతను ప్రజ లకు తెలియజేస్తున్న ఐజీబీఎస్ కృషి అద్వితీయమని పేర్కొన్నారు. ఈ ప్రాపర్టీ షో బిల్డర్లకు, కొనుగోలుదారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. స్థిరమైన రియల్ వ్యాపారానికి, ప్రజల ఆరోగ్యవంతమైన జీవన విధానానికి దోహదం చే స్తుందని చెప్పారు. గతంలో తను పౌరసరఫ రాల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్లాస్టిక్ విని యోగాన్ని తగ్గించేందుకు ఆకస్మిక తనిఖీలు చేశానని చెప్పారు.

కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో హరిత భవనాల నిర్మాణంలో ఐజీబీఎస్ కృషి అభినందనీయమని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఐజీబీఎస్ గ్రీన్ ప్రాపర్టీ షో స్థిరమైన జీవన ప్రాముఖ్యతను తెలియజేస్తుందని, ఇది బిల్డర్ల అద్భుత ప్రయత్నని ప్రశంసించారు. గ్రీన్ బిల్డింగ్ పద్ధతులను అవలభించడంలో తెలంగాణ మంచి పురోగతి సాధిస్తుందని పేర్కొన్నారు. ఈ ఉద్యమాన్ని ప్రజల భాగస్వామ్యంతో ఇంకా ముందుకు తీసుకు పోవాలని సూచించారు. 

తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోరి బిల్డర్లు గొప్ప ప్రయత్నం చేస్తున్నారని ప్రశంసించారు. నీటి సంరక్షణతో పాటు ఆరోగ్యంగా జీవించడంలో గ్రీన్ బిల్డింగ్‌లు ఎంతో దోహదం చేస్తాయని అన్నారు. ఐజీబీఎస్ జాతీయ వైస్ చైర్మన్ సీ శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ ప్రాపర్టీ షోను తెలంగాణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ౧౮, ౧౯ తేదీల్లో కూడా గ్రీన్ ప్రాపర్టీ షో జరుగనుంది.