23-04-2025 01:16:54 AM
పెన్ పహాడ్, ఏప్రిల్ 22 : ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతు నుంచి సేకరించిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు రవాణా చేయాలని.. కాంట వేసిన బస్తాలు నిల్వ ఉంచరాదని జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించి మాట్లాడారు.
ఈనెల 21న ‘ పేరుకే కొనుగోలు కేంద్రాలు’...ప్రా ‘ఆ’రంభం రోజే గ్రహపాటు అనే శీర్షిక లు ప్రచురితం కాగా మంగళవారం కలెక్టర్ జిల్లా అధికారులతో కలసి పెన్ పహాడ్ లోని పిఎసియస్,అనాజిపురం గ్రామంలోని ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ధాన్యం ఎగుమతులు, దిగుమతులు త్వరగా అయ్యేలా చూడాలని , కేటాయించిన మిల్లుల వల్ల ఇబ్బందులు ఎదురైతే తెలపాలని కలెక్టర్ తెలిపారు.
ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఉన్న ధాన్యాన్ని లారీలను ఎక్కువగా పెట్టి రవాణా చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఆనాజిపురం కొనుగోలు కేంద్రంలో లారీలో లోడ్ అవుతున్న రైతు చేన్ను జయమ్మ ధాన్యంన్ని కలేక్టర్ పరిశీలించారు.
ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని ఎక్కువగా ఉండటానికి గమనించి లారీలను ఎక్కువగా పెట్టాలని తాసిల్దార్ కు కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాంబాబు, ఆర్ డి ఓ వేణు మాధవ రావు, తాసిల్దార్ ధరావత్ లాలూ నాయక్, వివో అన్న మేరీ,వివోఎ ధనలక్ష్మి, కోశాధికారి సరిత, కార్యదర్శి ఎల్ శిరీష,అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.