calender_icon.png 18 April, 2025 | 3:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రజతోత్సవ సభను విజయవంతం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలి

10-04-2025 08:33:50 PM

వనమా, రేగ..

కొత్తగూడెం నియోజకవర్గం నుండి వేలాదిమంది తరలిరావాలి..

కొత్తగూడెం (విజయక్రాంతి): ఆస్తులు అమ్మడం, అప్పులు తేవడమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి రేగా కాంతారావు మామ వెంకటేశ్వరరావులు విమర్శించారు. గురువారం కొత్తగూడెం లోని బిఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఈనెల 27న వరంగల్ లో బిఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ సన్నాహక సమావేశము నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తల ఉద్దేశించి మాజీ మంత్రి, శ్రీ వనమా వెంకటేశ్వరరావు, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు  రేగా కాంతారావు లు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీలు ఇచ్చి అమలు చేయకుండా ప్రజలను దగా చేస్తోందని ధ్వజమెత్తారు.

వరంగల్లో జరిగే బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభకు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ గ్రంథాలయ కమిటీ చైర్మన్ దిండిగల రాజేందర్, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీ వనమా రాఘవేందర్ సీనియర్ నాయకులు కిలారి నాగేశ్వరరావు, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్ యాదవ్, మాజీ ఎంపీపీలో బాదావత్ శాంతి, బుక్య సోనా, సొసైటీ వైస్ చైర్మన్ కాంపల్లి కనకేష్, మాజీ కౌన్సిలర్లు, మాజీ కో ఆప్షన్ సభ్యులు, మాజీ ఎంపీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు కొట్టి వెంకటేశ్వర్లు, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య, మాజీ ఉర్దూగర్ కమిటీ చైర్మన్ అన్వర్ పాషా, టీబీజీకేస్ నాయకులు కాపు కృష్ణ పాల్గొన్నారు.