calender_icon.png 26 October, 2024 | 3:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎవర్‌గ్రీన్.. సుచిత్రా సేన్!

16-09-2024 12:00:00 AM

భారతీయ సినీరంగంలో సుచిత్రా సేన్‌ది ప్రత్యేక స్థానం. అందానికి అందం.. అభినయానికి అభినయం ఈ నటి సొంతం. దేశంలో ఏ నటికి లేని ప్రేక్షాకధారణ కేవలం సుచిత్ర సేన్‌కు మాత్రమే దక్కింది. ఇతర భాషల నటులంతా సుచిత్ర నటనకు జేజేలు పలికినవారంటే ఆమె ఛరిష్మా ఏపాటిదో అర్ధం చేసుకోవచ్చు. ఆమె నటనలో పదో వంతు చేస్తే చాలనుకున్నవాళ్లే. హిందీలో మీనా కుమారికి, తెలుగులో సావిత్రికి సుచిత్రా సేనే స్ఫూర్తి. బెంగాలీవాళ్లకైతే సుచిత్ర ఆరాధ్యనటి. సుచిత్రాసేన్- కాంబినేషన్‌లో 30 సినిమాలొచ్చాయి. వీటితో పాటు సుచిత్రాసేన్ మరో 30 సినిమాల్లో నటించింది. బెంగాలీలో క్లాసిక్స్ అని చెప్పుకునే అనేకానేక సినిమా ల్లో ఆమె నటించారు. ఆమెకు చిన్నవయసులోనే పెళ్లైంది.

సంగీతం చాలా ఇష్టం. సింగర్ రాణించాలనేది కోరిక. కానీ ఆమెను వెండితెర కథానాయికగా మార్చేసింది. ఆమె మొదటి చిత్రం 1953లో విడుదలైంది. ఆమెకు దర్శకుడు నితీశ్ రాయ్ సుచిత్రా అనే పేరు పెట్టుకున్నాడట. ఆమె 52 బెంగాలీ, 7 హిందీ చిత్రా లలో నటించింది. ఆమెకు ఆత్మవిశ్వాసం ఎక్కువ. అందుకే కథానాయకుల ఆధిక్య త ఉండే చిత్రరంగంలో హీరోలతో సమానంగా పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నారు. 

లెజండరీ సుచిత్రా సేన్‌తో కలిసి నటించాలనేది బాలీవుడ్ హీరో ధర్మేంద్ర చిరకాల కోరిక. అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయమై పలుమార్లు చెప్పారాయన. అయితే వీరిద్దరి కాంబినేషన్‌లో ‘మమ త’ అనే సినిమా హిట్ అయ్యిం ది. ఈ మూవీ షూటింగ్ సమయంలో ఊహించని సంఘటన ఒకటి జరిగింది. ధర్మేంద్ర, సుచిత్ర పాత్రలతో కూడిన రొమాంటిక్ సన్నివేశం ఉంది. అక్కడ వారి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అందర్నీ ఆకర్షించింది. అప్పుడే షూటింగ్ సెట్‌లో అడుగుపెట్టిన ధర్మేంద్ర సుచిత్ర మెడపై ముద్దు పెట్టాడు. దాంతో షాక్ అయ్యారు. అయితే సుచిత్ర మనసు నొచ్చుకోవడంతో  ధర్మేంద్ర క్షమాపణ చెప్పి ఆ వివాదానికి ముగింపు పలికారు. 

ఆంగ్లేయ చిత్ర విమర్శకుడు డెరెక్ సుచిత్ర అందానికి ఫిదా అయిన సందర్భాలెన్నో. “ఆమె నిజంగా చాలా అందగత్తె. ఆమెలో ఎన్నో అద్భతమైన భంగిమలున్నాయి. ఒకసారి తెరమీద కొద్ది నిమిషాలు కనిపిస్తే చాలు.. ఆ అనుభూతే వేరు. నాలాంటివారికి సుచిత్రా సేన్ ఒక గొప్ప మహానాయిక. దీనికి అనేక కారణాలున్నాయి. ఆమె సౌందర్యవతి. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ చలన చిత్ర నాయికలు చాలమంది అందగత్తెలే, కుందనపు బొమ్మలే. కానీ.. అందమొక్కటే చాలదు. నటనాకౌశల్యము కూడా కావాలి. ఒక చూపుతో, ఒక సైగతో, ఒక చిన్న పెదవి విరుపుతో గుండె లోతులలో ఉండే అనుభూతులను బయటికి తేవాలి.  దర్శకుడి భావాలను అర్థం చేసుకోవాలి. ఇవన్నీ సుచిత్రకే సాధ్యం” అని అంటారాయన.