calender_icon.png 30 January, 2025 | 8:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టెన్త్ విద్యార్థులకు సాయంత్రం స్నాక్స్!

30-01-2025 01:16:06 AM

హైదరాబాద్, జనవరి 29 (విజయక్రాంతి): పదో తరగతి విద్యార్థులకు సాయంత్రం వేళల్లో స్నాక్స్ అందించనున్నారు. మార్చి 21వ తేదీ నుంచి ఏప్రిల్ 2 వరకు టెన్త్ వార్షిక పరీక్షలు జరగనున్నాయి. మెరుగైన ఫలితాలను సాధించేందుకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు సాయంత్రం వేళల్లో స్పెషల్ క్లాసులు తీసుకుంటున్నారు.

విద్యార్థులు ఖాళీ కడుపుతో ఉండకుండా ఫిబ్రవరి 1 నుంచి మార్చి 20 వరకు అంటే 38 రోజులపాటు స్నాక్స్ అందించనున్నా రు. ఇందుకు సంబంధించిన నిధుల ను విడుదల చేస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి ఉత్త ర్వులు జారీ చేశారు. ఒక్కో విద్యార్థికి రూ.15 చొప్పున నిధులను కేటాయించారు.

ఉడకబెట్టిన పెసర్లు, పల్లీలు, బెల్లం/మిల్లెట్, బిస్కెట్స్, ఉడకబెట్టిన బొబ్బర్లు, పకోడ, ఉడకబెట్టిన శనగలు స్నాక్స్‌గా అందించనున్నారు. ఇందుకు మిడ్ డే మీల్స్ సిబ్బంది సేవలను వినియోగించుకోవాలని డీఈవోలను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలకు విడుదల చేయాల్సిన పెండింగ్ 50 శాతం స్కూల్ గ్రాంట్స్, స్పోర్ట్స్ గ్రాంట్స్ నిధులను పాఠశాల విద్యాశాఖ బుధవారం సాంక్షన్డ్ చేసింది.