calender_icon.png 17 January, 2025 | 5:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైకోర్టు తీర్పుతోనైనా కనువిప్పు కలగాలి

11-09-2024 12:35:43 AM

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్

 హైదరాబాద్,సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు బీసీ కులగణన చేపడతామని కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ద్వారా హామీ ఇచ్చింది. కానీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక మాత్రం ఆ దిశగా నిర్ణయాలు తీసుకోవడం లేదు. స్థానిక సంస్థ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీసీ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ విషయంలో మేం వెనుకడుగు వేయం. కనీసం హైకోర్టు తీర్పుతోనైనా సర్కార్‌కు కనువిప్పు కలగాలి.

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ బీసీ కులగణనను సమర్థిస్తున్నారు. ఆయన మాటకు రాష్ట్ర ప్రభుత్వం విలువ ఇచ్చినట్లు నిరూపణ కావాలంటే వెంటనే బీసీ కులగణను వెంటనే చేపట్టాలి. కుల గణనతోనే బీసీలకు విద్య, ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో న్యాయం జరుగుతుంది. తమది మాటలు చెప్పే ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం అని సీఎం రేవంత్‌రెడ్డి నిరూపించుకోవాలి. కుల గణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించాలి.