- అమ్మ ఆదర్శ పాఠశాలల్లో కొనసాగుతున్న పనులు
- ఇప్పటికీ 66శాతమే పూర్తి
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 15 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు హైదరాబాద్ జిల్లాలో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. విద్యాశాఖ అధికా రులతో కలెక్టర్ సమీక్ష సమావేశాలు నిర్వహించి, ఆదేశాలిచ్చినా అనుకున్న లక్ష్యం మేరకు పనులు జరగడం లేదు. ఇటీవల జరిగిన ఉపాధ్యాయుల బదిలీల ప్రభావం కూడా పనులపై పడింది. క్షేత్రస్థాయిలో అమ్మ ఆదర్శ కమిటీలు, కాంట్రాక్టర్లు, కొత్తగా వచ్చిన పలువురు ప్రధానోపాధ్యాయుల మధ్య సమన్వయం లోపించడంతో పలు పాఠశాలల్లో పనులు ఇంకా కొనసాగుతున్నాయి. పాఠశాలలు ప్రారంభమయ్యే (జూన్ 12) నాటికే పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ పనులు పూర్తి కావడంలో కాలయాపన జరుగుతోంది.
384 పాఠశాలల్లో పనులు
హైదరాబాద్ జిల్లా వ్యా ప్తంగా మొత్తం 691 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వాటిలో ప్రస్తుతం 384 పాఠశాలల్లో మంచినీరు, మరుగుదొడ్లు, విద్యుత్ సౌకర్యం, తదితర వసతుల కోసం అమ్మ ఆదర్శ పాఠశాలల పనులను మే నెలలో ప్రారంభించారు. జిల్లా విద్యాశాఖ ఎంపిక చేసుకున్న పాఠశాలలో ఈ పనులను చేపట్టడం కోసం రూ.23కోట్లను ప్రభుత్వం కేటా యించింది. ఈ పనులను చేయడం కోసం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేశారు. వారి ఆధ్వర్యంలో పనులను నిర్వహిస్తున్నారు.
ఇప్పటి వరకు జిల్లాలో చేపట్టిన పను ల్లో 66శాతం మా త్రమే.. అం టే 255బడుల్లో మాత్రమే పను లు పూర్తయ్యాయి. ఎంపిక చేసుకున్న 1,289 రకాల పనుల్లో 1,038 పనులు పూర్తయ్యా యి. ఇంకా 129 పాఠశాలల్లో పనులు కొనసాగుతున్నాయి. పూర్తి కావడానికి మరికొన్ని రోజుల సమయం పట్టే అవకాశముంది. హెచ్‌ఎంలు, అమ్మకమిటీలు సమన్వయంతో పలు బడుల్లో పనులు పూర్తి చే సుకున్నారు. పలు చోట్ల నిర్లక్ష్యం వహిస్తుండడంతో పనులు పూర్తి కావడానికి సమ యం పడుతోంది. ప్రభుత్వం విడుదల చేసిన నిధుల మేరకు పనులు పూర్తవగా.. నిధులు పెండింగ్ ఉన్న చోట నెమ్మదిగా సాగుతున్నాయి.
నల్లా కనెక్షన్ కోసం ఎదురుచూపులు
అమ్మ ఆదర్శపాఠశాలల పనుల ముఖ్య ఉద్దేశం ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు కల్పించడం. అం దులో భాగంగా అన్ని పాఠశాలలకు మంచినీటి వసతి కల్పించాలని, మినీ వాటర్ ట్యాంకులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కానీ నగ రంలోని పలు పాఠశాలలకు ఇప్పటి వరకు బోర్ నీళ్లే గతి. అమ్మ ఆదర్శ కమిటీ పనుల వల్ల ఇటీవల పలు పా ఠశాలలకు నల్లా కనెక్షన్లు వచ్చినప్పటి కీ.. ఇంకా నల్లా కనెక్షన్ కోసం ఎదురు చూస్తున్న పాఠశాలలు 88 ఉన్నాయి.