calender_icon.png 13 March, 2025 | 6:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధికారం పోయినా అహంకారం తగ్గలేదు

13-03-2025 02:15:27 AM

  • గవర్నర్‌కు కేటీఆర్ క్షమాపణలు చెప్పాలి 

తెలంగాణతల్లి, రాజీవ్ విగ్రహాలను టచ్‌చేస్తే బట్టలూడదీసి కొడుతారు

పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ హెచ్చరిక

హైదరాబాద్, మార్చి 12 (విజయక్రాంతి): గవర్నర్‌పై కేటీఆర్ ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని, గవర్నర్‌కు వెంటనే కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ డిమాండ్ చేశారు. తెలంగాణ తల్లి, రాజీవ్‌గాంధీ విగ్రహాలను టచ్‌చేస్తే.. కాంగ్రెస్ కార్యకర్తలు కేటీఆర్ బట్టలూడదీసి కొడుతారని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలు కర్రుకాల్చి వాతపెట్టినా కేటీఆర్‌కు బుద్ధి రాలేదని, అధికారం పోయి నా అహంకారం తగ్గలేదని దుయ్యబట్టారు.

బుధవారం ఆయన అసెంబ్లీ మీడియాతో పాయింట్ వద్ద ప్రభుత్వ విప్‌లు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఆది శ్రీనివాస్, బీర్ల అయిలయ్య, రామచంద్రనాయక్‌తో కలిసి మాట్లాడారు.. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ఓర్వలేకనే కేటీఆర్ దిగజారుడు మాట్లాడుతున్నారని, ఫామ్‌హౌస్‌లో పడుకున్న కేసీఆర్‌కు అభివృద్ధి ఎలా కనిపిస్తుం దని నిలదీశారు. 

కాంగ్రెస్ తల్లి, రాహుల్‌గాంధీ తండ్రి విగ్రహాలను ప్యాక్ చేసి గాంధీభవన్‌కు పంపిస్తా మని కేటీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నారని మండిప డ్డారు. మాజీసీఎం కేసీఆర్ కేసీఆర్ ప్రధాన ప్రతిపక్షనేతగా అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు.