calender_icon.png 27 January, 2025 | 6:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నోటీసులు ఇచ్చినా లెక్క చేయలేదు!

26-01-2025 12:54:37 AM

* నిబంధనలకు విరుద్ధంగా షెడ్డు కన్‌స్ట్రక్షన్

* నోటీసులు జారీ చేసిన టౌన్ ప్లానింగ్ అధికారులు 

* ఆ తర్వాత పట్టించుకోకపోవడంతో తిరిగి పనులు ప్రారంభం 

* షెడ్డు పనులు పూర్తికావొస్తున్న వైనం 

* కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్

 రాజేంద్రనగర్, జనవరి 25: రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని హైదర్గూడ ఎర్రబోడ ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా ఓ షెడ్డు నిర్మాణం చేపట్టారు. సుమారు 1000 గజాలకు పైగానే స్థలంలో భారీ స్థాయిలో షెడ్డు కొన్ని రోజులుగా నిరంతరాయంగా   నిర్మిస్తున్నారు. ఈ విషయమై కొన్నిరోజుల క్రితం స్థానికులు జిహెచ్‌ఎంసి అధికారులకు ఫిర్యాదు చేశారు. అప్పట్లో స్పందించిన టౌన్ ప్లానింగ్ అధికారులు సదరు వ్యక్తికి నోటీసులు ఇచ్చి పనులు నిలుపుదల చేయించారు. దీంతోపాటు పనులు చేస్తున్న చోటు నుంచి పరికరాలు కూడా జిహెచ్‌ఎంసి కార్యాలయానికి తీసుకెళ్లారు. 

ఏం జరిగిందో ఏమోమరి..!

 అయితే ఆ తరువాత ఏం జరిగిందో ఏమో కానీ మళ్ళీ పనులు ప్రారంభమై చకచకా జరుగుతున్నాయి. పనులు నిరంతరంగా జరుగుతున్న నేపథ్యంలో మరికొన్ని రోజుల్లో షెడ్డు నిర్మాణం పూర్తి కానుంది. 

విమర్శల వెల్లువ 

 టౌన్ ప్లానింగ్ అధికారులు నోటీసులు ఇచ్చినా కూడా సదరు వ్యక్తి పనులు పూర్తి చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కఠిన చర్యలు తీసుకోవాల్సిన టౌన్ ప్లానింగ్ అధికారులు మెతక వైఖరి అవలంబిస్తుండటంతో స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా స్పందించి టౌన్ ప్లానింగ్ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తున్నారు. 

చర్యలు శూన్యమేనా..!

 ఎప్పటికప్పుడు అక్రమ నిర్మాణాల విషయంలో ఉక్కుపాదం మోపల్చిన జిహెచ్‌ఎంసి టౌన్ ప్లానింగ్ సిబ్బంది నోటీసులు ఇచ్చి ఊరుకోవడం ఏంటని స్థానికులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే స్పందించి షెడ్డు నిర్మాణాన్ని కూల్చివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై జిహెచ్‌ఎంసి టౌన్ ప్లానింగ్ ఏసిపి శ్రీధర్ ను వివరణ కోరగా.. క్షేత్రస్థాయిలో పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అక్రమ నిర్మాణాల విషయంలో ఊరుకునేది లేదని తెలిపారు.