calender_icon.png 21 November, 2024 | 11:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాయ పాత్రను చాలెంజ్‌గా తీసుకున్నా

21-11-2024 12:00:00 AM

విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మెకానిక్ రాకీ’. రవితేజ ముళ్లపూడి తొలిసారి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికలు. ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రం నవంబర్ 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ బుధవారం విలేకరులతో ప్రత్యేకంగా సమావేశమై చిత్ర విశేషాలను పంచుకున్నారు. 

* నేనొక ఆర్మీ ఫ్యామిలీలో పుట్టాను. రెండేళ్లకోసారి స్టేట్ షిఫ్ట్ అవుతుంటాం. సహజంగానే నాకు డిఫరెంట్ థింగ్స్ ఎక్స్‌పీరియన్స్ చేయడం ఇష్టం. ‘మెకానిక్ రాకీ’లో నాది డిఫరెంట్ క్యారెక్టర్. నేనిప్పటివరకు ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు. ఒక ఛాలెంజ్‌గా తీసుకొని మాయ క్యారెక్టర్‌ను చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను. మీనాక్షికి నాకు కాంబినేషన్ సీన్స్ పెద్దగా లేవు కానీ సెట్స్‌లో చాలా సార్లు కలిశాం.

తనదీ ఆర్మీ కుటుంబమే. అలా మాకు చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. గతంలో విశ్వక్ చెప్పిన ఓ కథను రిజెక్ట్ చేశాను. నాకు రీమేక్ సినిమాలు చేయడం అంత ఇష్టం ఉండదు. అందుకే చేయడం కుదరలేదు. ఫైనల్‌గా ఇందులో విశ్వక్‌తో పనిచేయడం ఎక్సయిటె డ్‌గా అనిపించింది. 

* చూడటాని హారర్ జోనర్ ఇష్టం. ‘కల్కి’ లాంటి సైన్స్ ఫిక్షన్ కథల్లో నటించడానికి ఇష్టపడతా. ‘బాహుబలి’ లాంటి పిరియడ్ సినిమా లో పార్ట్ అవ్వాలని ఉంటుంది. కామెడీ సినిమాల్లో కూడా చేయాలని ఉంది. ‘మెకానిక్ రాకీ’ తర్వాత నాకు ఇంకా డిఫరెంట్ రోల్స్ వస్తాయని భావిస్తున్నా. -‘డాకు మహారాజ్’ సంక్రాంతికి వస్తోంది. తమిళ్‌లో ఓ వెబ్ సిరిస్ చేస్తున్నా. విష్ణు విశాల్‌తో ఓ సినిమా చేస్తున్నా. 

* నాకు ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్స్ లేరు. ప్రతి సినిమా ఒక లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్‌గా తీసుకొని ముందుకు వెళుతున్నా. హిట్స్, ఫ్లాప్స్‌ను ఒకేలా తీసుకోవడం అలవాటు చేసుకున్నా. నాకు క్యాలిటీ వర్క్స్ చేయడం ఇష్టం. అందుకే కొంచెం సెలెక్టివ్‌గా ఉంటాను.

కథ హిట్ అవుతుందా.. లేదా? అనేది మన చేతిలో ఉండదు. పేపర్ మీద అది ఎంత స్ట్రాంగ్‌గా ఉందో చూసుకుంటా. అలాగే నా  క్యారెక్టర్‌కున్న ప్రాధాన్యత చూస్తా. ఒక ఆడియన్‌గా ఎలాంటి సినిమాలు చూడటానికి ఇష్టపడతానో అలాంటి కథలు చేయడానికి ఇష్టపడతా.  

* ఫిలిం క్రిటిసిజంను అంత సీరియస్‌గా తీసుకోను. సినిమా గురించి ఎవరైనా ఒపీనియన్ చెప్పొచ్చు. ఒక ఆడియన్‌గా నాకూ ఒక ఒపినియన్ ఉంటుంది. అయితే పర్సనల్ ఎటాక్ మాత్రం కాస్త హర్టింగ్‌గా అనిపిస్తుంది.