calender_icon.png 19 January, 2025 | 5:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్రుటిలో చావు నుంచి తప్పించుకున్నా

19-01-2025 12:00:00 AM

షేక్ హసీనా 

న్యూఢిల్లీ, జనవరి 18: తాను ఎన్నో సార్లు చావు నుంచి తప్పించుకున్నానని, తనపై జరిగిన హత్యాయత్నాల గురించి బంగ్లాదేశ్  మాజీ ప్రధాని షేక్ హసీనా కీలక విషయాలు వెల్లడించారు. అనూహ్యంగా పదవి కోల్పోయిన షేక్ హసీనా గత కొంతకాలంగా భారత్‌లో ఆశ్రయం పొందుతున్న విషయం తెలిసిందే.

తాజాగా అవామీ లీగ్ పార్టీ ఫేస్‌బుక్ ఖాతాలో ఆడియో సందేశంలో తాను అధికారంలో ఉన్నప్పుడు జరిగిన హత్యాయత్నాల గురించి వెల్లడించారు.. గతేడాది ఆగస్టులో అవామీ లీగ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరిగిన నేపథ్యంలో తనపై హత్యాయత్నం చేశారని ఆమె తెలిపారు. ఆ సమయంలో తాను, తన సోదరి రెహానా 20 నిమిషాల వ్యవధిలో చావు నుంచి తప్పించుకున్నట్లు చెప్పారు. ఆ తర్వాత భారత్‌కు చేరుకున్నామన్నారు.