calender_icon.png 28 March, 2025 | 2:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తాను మరణించినా నేత్రాలు సజీవం

21-03-2025 01:25:21 AM

తిమ్మాపూర్, మార్చి20 (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోరండ్ల గ్రామానికి చెందిన కిన్నెర మల్లయ్య (56) బుధవారం రాత్రి మానకొండూర్ మండలం శంషాబాద్ వద్ద జరిగిన రోడ్ ప్రమాదం లో మృతి చెందారు.

కుటుంబ సభ్యుల అంగీకారం మేరకు మృతుని నేత్రాలను ఎల్ వి ప్రసాద్ కంటి ఆసుపత్రి కి దానం చేసారు.తన తండ్రి చనిపోయినా మరొకరి జీవితానికి నేత్రాలు ఉపయోగపడాలనే ఆశయం తో తన తండ్రి నేత్రాలను దానం చేసినట్లు మల్లయ్య కొడుకు అనిల్ పేర్కొన్నారు.