calender_icon.png 7 October, 2024 | 4:08 AM

ఉన్నత పదవి రేసులో ఉన్నా

07-10-2024 01:33:16 AM

కాంగ్రెస్ ఎంపీ కుమారి సెల్జా

హస్తానికే అనుకూలంగా ఎగ్జిల్ పోల్స్

న్యూఢిల్లీ, అక్టోర్ 6: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ 60 సీట్ల మార్క్‌ను దాటుతుందని కాంగ్రెస్ ఎంపీ కుమారి సెల్జా ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే హర్యానాలో గెలుపుపై ధీమాగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే విష యం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిగ్‌గా మారింది.

మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా, రణదీప్ సుర్జేవాలా, కుమారి సెల్జా.. సీఎం రేసులో ఉన్నా రు. ముఖ్యంగా ఎస్సీ మహిళ, బలమైన నేత గా ఉన్న కుమారి సెల్జావైపే మెజార్టీ నేతలు మొగ్గు చూపిస్తున్నట్లు సమచారం. అయి తే ముగ్గురు నేతలు కూడా ఎన్నికలకు ముందు తాము అత్యున్నత పదవి రేసులో ఉన్నట్లు పలు సభల్లో ప్రస్తావించారు. 

పార్టీ కోసం అందరూ కష్టపడ్డారు..

సెల్జా ఓ మీడియా ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఎన్నికల మైదా నంలో మేమంతా కష్టపడ్డాం. పార్టీలో నాకంటే చాలామంది సీనియర్లు, ఎన్నికల్లో గెలుపు కోసం కష్టపడినవారు ఉన్నారు. అందరికీ ముఖ్యమంత్రి కావాలని ఉంటుం ది. అయితే అధిష్ఠానం నిర్ణయమే శిరోధా ర్యం. కేవలం ఎమ్మెల్యేలుగా గెలిచిన వారినే సీఎం చేయాలనే ఆలోచనకు నేను వ్యతిరే కం. అది పార్టీలో వర్గీకరణకు దారి తీస్తుంది. హైకమాండ్ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి’ అని కోరారు.