‘కాస్టింగ్ కౌచ్‌కు సంబంధించిన చేదు అనుభవాలను చాలా మంది హీరోయిన్లు వెల్లడించారు. ఇప్పుడీ జాబితాలో ఇషా కొప్పికర్ కూడా చేరిపోయింది. ‘అప్పుడు నాకు సుమారు 23 ఏండ్లు ఉంటాయి. అప్పటికే కొన్ని ఎఫైర్లు ఉన్న ఓ పెద్ద నటుడు నన్ను ఒంటరిగా ఇంటికి రమ్మన్నాడు. కానీ నేను దానికి ఒప్పుకోలేదు’ అని తెలిపింది. 18 ఏండ్ల వయసులో ఇలాంటి అనుభవమే మరొకటి కూడా ఎదురైందట ఇషాకు. ‘ఓ హీరో దగ్గర సెక్రటరీగా పనిచేస్తున్న ఒక లేడీ.. హీరోతో కొంచెం ఫ్రెండ్లీగా ఉండు అన్నది. హీరో అభ్యంతరకరంగా తాకినా సద్దుకుపోవాలి అని చెప్పింది’ అని తన అనుభవాన్ని వెల్లడించిన ఇషా.. ‘అలాంటి ఫ్రెండ్లీ నేచర్ నాకు లేదు అని ఆమె మొహం మీదే చెప్పేసిందట! బాలీవుడ్లో హృతిక్ రోషన్‌తో ‘ఫిజా’ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తెలుగులో నాగార్జున నటించిన ‘చంద్రలేఖ’లో కనిపించింది. 29 ఏండ్ల గ్యాప్ తర్వాత ఇప్పుడు రీ ఎంట్రీ ఇవ్వనుంది.