టార్చిలైట్ వెలుగులో అంత్యక్రియలు
కార్వాన్, జనవరి 1: దక్షిణ కాశీగా గుర్తింపు పొందిన బాపూఘాట్ త్రివేణి సంగమం శ్మశాన వాటికలో పరిస్థితులు అధ్వాన్నంగా తయారయ్యాయి. కనీసం విద్యుత్ దీపాలు కూడా లేకపోవడంతో సాయంత్రం దాటిన తర్వాత అంత్యక్రియలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మంగళవారం రాత్రి స్థానిక బీజేపీ నేత చంద్రశేఖర్ తల్లి అంత్యక్రియలు నిర్వహించారు.
శ్మశానవాటికలో విద్యుత్ దీపాలు కూడా లేకపోవడంతో పలువురు సెల్‌ఫోన్ లైట్లను వినియోగించి అంత్యక్రియలను నిర్వహించడం అందరి హృదయాలను ద్రవింపజేసింది. కొన్నినెలలుగా శ్మశాన వాటిక అంధకారంలో ఉందని చెప్పినా అధికారులు ఏమాత్రం స్పందించడం లేదని నేతలు ఇంద్రసేనారెడ్డి, నాగేంద్రప్రకాశ్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.