ఎమ్మెల్సీ కోదండరాం
సిద్దిపేట, జనవరి 30(విజయక్రాంతి): సిద్దిపేట జిల్లాలోని తొగుట, కొండపాక మండలాల మధ్య నిర్మించిన 50 టీఎంసీల ప్రాజెక్టు వద్దని, టీఎంసీల స్థాయి తగ్గించాలని సూచించినప్పటికీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం వినిపించుకోలేదని ఎమ్మె కోదండరాం ఆరోపించారు.
కొండి మల్లారెడ్డి రచించిన ‘గూడు చెదిరిన దృశ్యం’ కవిత సంపుటిని గురువారం సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో ఆవిష్కరించిన కోదండరాం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ కవిత సంపుటి మల్లన్నసాగర్ బాధితుల కష్టాలను కళ్లకు కట్టినట్లు రాసిన మల్లారెడ్డిని అభినందిస్తున్నట్లు తెలిపారు.
భౌగోళిక పరిస్థితుల పరంగా 50 టీఎంసీల ప్రాజెక్టు నిర్మిస్తే భూకంపాలకు దారితీస్తుందని కేంద్ర సంస్థలు హెచ్చరికలు జారీచేసినా గత ప్రభుత్వం నిబంధనలు బేఖాతర్ చేసిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో హన్మంత రెడ్డి, కిసరి స్వామి, ప్రవీణ్ పాల్గొన్నారు.