13-04-2025 12:00:00 AM
లాజిక్స్ లేకపోయినా కామెడీ వర్కౌట్ అయితే చాలు ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలు నమోదు చేస్తున్నాయిప్పుడు. అలాంటి పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా ముస్తాబవుతోంది ‘పురుషః’ చిత్రం. వీరూ ఉలవలను ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బత్తుల కోటేశ్వరరావు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంతో పవన్‌కళ్యాణ్ తెరంగేట్రం చేస్తున్నారు. ఈ సినిమాను విజయవాడ కనకదుర్గ ఆలయంలో శనివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఈ మూవీ టైటిల్ లోగో, పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో వైష్ణవి కొక్కుర, విషిక, హాసిని సుధీర్ కథానాయికలుగా నటిస్తుండగా.. వెన్నెల కిశోర్, సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్, వీటీవీ గణేశ్ ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సతీశ్ ముత్యాల, సంగీతం: శ్రవణ్ భరద్వాజ్; ఎడిటర్: కోటి.