calender_icon.png 30 October, 2024 | 8:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

59 రోజులు సమ్మె చేసినా బీఆర్‌ఎస్ పట్టించుకోలే

25-07-2024 12:28:50 AM

సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని 

బీఆర్‌ఎస్ ఆర్టీసీ విషయంలో ఇప్పుడు ఆందోళన చేస్తోందని, అధికారంలో ఉన్నప్పుడు ఆర్టీసీ కార్మికులు 59 రోజులు సమ్మె చేసినా పట్టించుకోలేదని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు. సమ్మె కాలంలో  ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపారు. హుజూర్‌నగర్‌లో ఘటన వల్ల బీఆర్‌ఎస్‌కు తమ మద్దతు ఉపసంహరించుకున్నట్లు తెలిపారు. ఆర్టీసీ కార్మికుల కోసం తమ పార్టీ కూడా ఆరు రోజులు సమ్మె చేసినట్లు చెప్పారు. కార్మికులను ప్రభుత్వంలో విలీన ప్రక్రియలో చేర్చాలని, వారికి రావాల్సిన డీఏ కూడా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.