calender_icon.png 23 September, 2024 | 10:00 AM

కొడుకు ఫీజుకోసం అడుక్కొన్నా

23-09-2024 02:15:01 AM

ఆప్ నేత సిసోడియా

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: లిక్కర్ కేసులో తనను జైలుకు పంపి ఆప్ నేతలకు వ్యతిరేకంగా మాట్లాడాలని తీవ్ర ఒత్తిడి తెచ్చారని, ఒకానొక సమయంలో చంపుతామని కూడా బెదిరి ంచారని ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ సీఎం మనీశ్ సిసోడియా ఆరోపించారు. ఆదివారం ఆప్ నిర్వహించిన జనతాకీ అదాలత్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తాను జైల్లో ఉన్నప్పుడుకు తన కుమారుడి కాలేజీ ఫీజు కోసం కూడా డబ్బు లేక అడుక్కోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు. ‘మనల్ని విడదీయాలని వారు ప్రయత్నించారు. కేజ్రీవాలే నిన్ను ఇరికిం చాడని నన్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. కోర్టు నా పేరు కేజ్రీవాలే చెప్పాడని వెల్లడించారు.

కేజ్రీవాల్ పేరు చెప్తే నువ్వు సేఫ్‌గా ఉంటావని ప్రలోభపెట్టారు. జైల్లోనే చంపేస్తారని బెదిరించారు. నీ గురించి, నీ భార్య, కుమారుడి గురించి మాత్రమే ఆలోచించుకో అని హెచ్చరించారు. కానీ నేను మాత్రం ఒక్కటే చెప్పిన. మీరు రాముడిని, లక్ష్మణుడిని విడదీసేందుకు ప్రయత్నిస్తున్నారు అని అన్నాను. ఈ ప్రపంచంలో ఆ పని చేయగల రావణుడు ఎవరూ లేరని తేల్చి చెప్పిన. గత 26 ఏండ్లుగా అరవింద్ కేజ్రీవాల్ నా సోదరుడు.. రాజకీయ గురువు. మమ్మల్నిగానీ, పార్టీని గానీ వాళ్లు (బీజేపీని ఉద్దేశించి) విడదీయలేరు.