పుష్ప2 సినిమా ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టిస్తోంది. ఇన్నా ళ్లు సినిమా ప్రమోషన్లతో ఎక్కడికివెళ్లినా తగ్గేదేలా! అంటూ హల్‌చల్ చేసిన అల్లు అర్జున్.. సంధ్య థియేటర్ ఘటన, అరెస్టు తర్వాత కాస్త తగ్గారు.అయితే ఆయన అభిమానులు మాత్రం తగ్గడం లేదు. సోషల్ మీడియాలో ఇప్పటికీ పుష్పకు పేరడీగా అనేక వీడియోలు సందడి చేస్తున్నారు.
తాజాగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో హాఫ్ సెంచరీ చేసిన తర్వాత బ్యాటర్ నితీశ్‌కుమార్‌రెడ్డి సైతం పుష్ప స్టుల్‌లో బ్యాట్‌తో గడ్డం కింద.. ‘నీయవ్వ.. తగ్గేదేలే’ అన్నట్టు అభివాదం చేశారు.
ఈ సీన్ చూసిన తర్వాత తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి దెబ్బకు హీరో అల్లు అర్జున్ తగ్గినా.. ఆయన అభిమానులు మాత్రం తగ్గడం లేదని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అంతర్జాతీయ వేదికపై పుష్ప మ్యానరిజాన్ని అనుకరించడంతో మరోసారి ఈ సినిమాపై అభిమానులు చర్చించుకుంటున్నారు.
పెద్ది విజయ భాస్కర్