10-04-2025 12:41:18 AM
జల్‌పల్లి ఇంటి గేటు ఎదుట బైఠాయించిన మనోజ్ కుమార్
మహేశ్వరం, ఏప్రిల్ 9 (విజయక్రాంతి) : తన తండ్రి మోహన్‌బాబు నుంచి దూరం చేసేందుకు సోదరుడు విష్ణు కుట్రలు చేస్తున్నాడని సినీ నటుడు మంచు మనోజ్ కుమార్ ఆరోపించారు.బుధవారం రంగరెడ్డి జిల్లా జల్‌పల్లి నివాసంలోకి ఆయన వెళ్లేందుకు ప్రయత్నించగా పహాడిషరీఫ్ పోలీసు లు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు మంచు మనోజ్‌కు మధ్య కొద్దీసేపు వాగ్వదం చోటు చేసుకుంది.
దీంతో మనోజ్ ఇంటి గేటు ముందు కూర్చొన్ని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తన జుట్టును తీసుకెళ్లి సోదరుడు విష్ణు చేతుల్లో పెట్టేందుకు కుట్రలు జరుగుతున్నాయన్నారు.కోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ నన్ను ఎందుకు ఇంట్లోకి వెళ్లేందుకు అనుమతి ఇవ్వడం లేదో అర్థం కావడం లేదన్నా రు. విద్యార్థులకు న్యాయం చేయాలని కోరినప్పటి నుంచి తమ కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరుగుతున్నాయని తెలిపారు.
ఏ రోజు తను ఆస్తి కోసం గొడవ చేయలేదని పేర్కొన్నారు. ఏప్రిల్ 1వ తేదీన పాప పుట్టిన రోజు సందర్భంగా జైపూర్ వెళ్లిన సమయంలో సోదరు డు విష్ణు ఇంటిని ధ్వసం చేయడంతో పాటు విలువైన వస్తువులు, కారును తీసుకెళ్లారన్నారు. ఈ మధ్య జరిగిన గొడవల కారణంగా పోలీస్ స్టేషన్‌లో మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు అయ్యాయని గుర్తు చేశారు.పోలీసులు ఏ ఒక్క ఎఫ్‌ఐఆర్‌లో కూడా ఛార్జీషీట్ వేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తను చెడ్డవాడిగా ప్రచారం చేస్తున్న విష్ణు దగ్గర ఏ ఒక్క నిజమైన ఆధా రం లేదన్నారు. ఇంట్లో పెట్స్ ఉన్నాయని కాళ్ళు పట్టుకున్న తనను పోలీసులు ఇంట్లోకి అనుమతి ఇవ్వడం లేదని బాధ పడ్డారు.
కన్నప్ప సినిమా విడుదల రోజునే తన బైరవ సినిమా విడుదల తేదీ ప్రకటించడంతో విష్ణు తనపై పగ పెంచుకున్నాడని అన్నారు. తనకు జరుగుతున్న అన్యాయం పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించాలని ఆయన కోరారు. నేను కర్మ సిద్ధాంతం నమ్ముతానని..నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళు కర్మ అనుభవిస్తారని ఆయన కంటతడి పెట్టుకున్నారు.