12-03-2025 12:01:23 AM
చియాన్ విక్రమ్ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్-ప్యాక్డ్ మూవీ ‘వీర ధీర సూరన్ పార్ట్ 2’. ఎస్.యు. అరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య, సూరజ్ వెంజరాముడు, దుషార విజయన్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రాన్ని హెచ్‌ఆర్ పిక్చర్స్ రియా శిబు నిర్మించారు. ఇది ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుందని మేకర్స్ చెబుతున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా మేకర్స్ ‘కలల్లో’ సాంగ్‌ని రిలీజ్ చేశారు. జీవి ప్రకాష్ కుమార్ ఈ పాటని బ్యూటీఫుల్ లవ్ మెలోడీగా కంపోజ్ చేశారు. శరత్ సంతోష్, రేష్మ శ్యామ్ తమ ప్లజెంట్ వోకల్స్‌తో మెలోడీ అండ్ గ్రేస్‌ని మరింత ఎలివేట్ చేశా రు.
రాజేష్ గోపిశెట్టి రాసిన లిరిక్స్ మనసుని హత్తుకున్నాయి. ‘కలల్లో కానరాకున్నా.. నీకోసం నేను వేచు న్నా. నిన్నే నా ఏడు జన్మల తోడుగా కోరుకుంటున్నా” అంటూ సాగే లిరి క్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతున్నాయి. ఈ పాటలో విక్రమ్, దుషార విజయన్ కెమిస్ట్రీ చాలా నేచురల్ గా ఉంది. ఈ లవ్ ట్రాక్ ఇన్‌స్టెంట్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రం మార్చి 27, 2025న ప్రేక్షకుల ముందుకు రానుంది.