మెల్‌బోర్న్: బాక్సింగ్ డే టెస్ట్ నాలుగో రోజు ముగిసే సరికి ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలుపుకుని ఆసీస్‌కు 333 పరుగుల ఆధిక్యం లభించింది. 358/9తో నాలుగో రోజు ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ మరో 11 పరుగులు జోడించి ఆలౌట్ అయింది. 114 పరుగులు చేసిన నితీశ్ రెడ్డి చివరి వికెట్‌గా వెనుదిరిగాడు.
పదో వికెట్‌కు 50+ భాగస్వామ్యం
173 పరుగుల వద్ద కెప్టెన్ కమిన్స్ తొమ్మిదో వికెట్‌గా వెనుదిరిగాడు. దీంతో ఇక తొందరగానే ఆసీస్ ఇన్నింగ్స్ ముగుస్తుందని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. చివరి వికెట్‌కు లయన్ (41*), బోలాండ్ (10*) 55 పరుగుల భాగస్వా మ్యం నెలకొల్పారు. ఈ జోడీని ఔట్ చేసేందుకు భారత బౌలర్లు ఎంత శ్రమించినా కానీ ఫలితం లేకుండా పోయింది. రోజు ము గిసే వరకు కూడా వారు క్రీజులోనే ఉన్నారు.
తప్పులు చేస్తూ తడబడుతూ..
మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ 474 పరుగులు చేసిన చోట మనోళ్లు 369 పరుగులు మాత్రమే చేయగలిగారు. తెలుగు ఆటగాడు నితీశ్ రెడ్డి పోరాటం వల్ల ఆ మాత్రం గౌరవప్రద స్కోరు వచ్చింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో అయినా ఆసీస్‌ను త్వరగా ఔట్ చేసి ఒత్తిడిలోకి నెడతారని ఆశించిన అభిమానులకు మరలా నిరాశే ఎదురైం ది.
యువ ఆటగాడు జైస్వాల్ పలు మార్లు క్యాచ్‌లను జారవిడిచాడు. అర్ధసెంచరీతో చెలరేగిన లబుషేన్ క్యాచ్‌ను కూడా జైస్వాల్ జారవిడవడం గమనార్హం. కీలక భాగస్వామ్యం నెలకొల్పిన కమిన్స్ క్యాచ్‌ను కూడా జైస్వాల్ నేలపాలు చేశాడు. దీంతో కెప్టెన్ రోహిత్ జైస్వాల్‌పై ఒకిం త అసహనం వ్యక్తం చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లతో మెరిసిన బుమ్రా కూడా తప్పిదం చేశాడు.
నో బాల్ వేసి ఐదో వికెట్ తీసే చాన్స్‌ను మిస్ చేసుకున్నాడు. బుమ్రా కనుక ఆ నోబాల్ వేయకుండా ఉండి ఉంటే.. లయన్ ఎప్పుడో ఔటయ్యేవాడు.
గెలుపు కష్టమే..
నేడు నాలుగో టెస్టు ఆఖరి రోజు. ఆసీస్ ఇప్పటికే 333 పరుగుల ఆధిక్యంలో ఉంది. లీడ్ 340+ అయ్యే అవకాశం ఉంది. ఈ స్కోరును చేధించడం అంత సులువు కాదు. ఒక వేళ భారత్ ఈ లక్ష్యాన్ని చేధిస్తే మెల్‌బోర్న్ వేదికగా జరిగిన ఓ టెస్టులో అత్యధిక లక్ష్యాన్ని చేధించిన జట్టుగా రికార్డులకెక్కనుంది.
రికార్డు నెలకొల్పిన బుమ్రా..
భారత పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 200 వికెట్ల మైలురాయిని అందుకున్న బౌలర్‌గా నిలిచాడు. జడేజా కూడా 44 టెస్టుల్లోనే ఈ ఫీట్ సాధించాడు. 200 వికెట్లు తీసిన 12వ భారత బౌలర్ బుమ్రా. హెడ్‌ను ఔట్ చేయడం ద్వారా బుమ్రా ఈ మైలురాయిని చేరుకున్నాడు.