calender_icon.png 10 February, 2025 | 5:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీడైనా అంతేగా..

27-01-2025 12:00:00 AM

మనసు కాస్తా కుదుట పడితే బాగుండు అవ్యక్త దిగులొకటి వెంటాడుతున్నది యుద్ధమూ లేదు గాయాలూ లేవు భ్రమ పూర్వక పరాజయమొకటి వెంటాడుతున్నది!

సమూహం మధ్య నేను

ఒంటరిగా దిగులు దిగులుగా నుంచున్న

ఓదార్చే చేతులకోసం ఎదురుచూస్తూ

నేనూ నిప్పులమీద నడిచిన వాడినే

ఎన్నో బాధల్ని దిగమింగిన వాడినే

ఇది కష్టమో కాలపరీక్షో తెలియదు

మనసు విప్పలేక పోతున్న

శక్తి ఉడగలేదు యుక్తి తరగలేదు

ఒక తరాన్ని వీడి 

మరో తరంలోకి పయనిస్తున్న

నమ్మదగిన మిత్రులు ఒకరొకరు

కనుమరుగై పోతుంటే కాలం 

కలవరపెడుతున్నది!

ఒక్కోసారి 

వచ్చిన పని అయిపోయినట్లేనా అని

మనసు పదేపదే ప్రశ్నిస్తున్నట్లుంటది!

’విజయవంతం’గా అని చెప్పాలని ఉంది

చెబితే ప్రయాణం ఆగిపోతుందా?

నీడైనా అంతేగా

మనం తోడున్నంత వరకే మన వెంట!!

కోట్ల వెంకటేశ్వర రెడ్డి

9440233261