- సినిమా చూశాకే వెళ్తానని అల్లు అర్జున్ పట్టుబట్టారు
- సంధ్య థియేటర్ ఘటనపై వివరణ ఇచ్చిన చిక్కడపల్లి ఏసీపీ
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 22 (విజయక్రాంతి): పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. దీనిపై శనివారం తెలంగాణ అసెంబ్లీలోనూ చర్చ జరిగింది. అనంతరం అల్లు అర్జున్ కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తనపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని వాపోయారు.
ఈ నేపథ్యం లో ఆదివారం జరిగిన హైదరాబాద్ కమిషనరేట్ వార్షిక నివేదిక కార్యక్రమంలో సీపీ సీవీ ఆనంద్ స్పందించారు. తొక్కిసలాట ఘటనకు సంబంధించిన పూర్వాపరాలను వివరించారు. ఘటనకు సంబంధించిన సం బంధిత వీడియోను విడుదల చేశారు. అనంతరం సంధ్య థియేటర్ వద్ద జరిగిన విష యాన్ని చిక్కడపల్లి ఏసీపీ రమేశ్ కుమార్ మీ డియాకు వివరించారు.
అల్లు అర్జున్ మేనేజ ర్ సంతోష్‌ని కలిసి ‘తొక్కిసలాట లో మహిళ చనిపోయారు, బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. పరిస్థితి అదుపుతప్పింది. ఇక్కడి నుం చి వెళ్లిపోవాలి’ అని సూచించాం. అయినా.. మేనేజర్ మమ్మల్ని అల్లు అర్జున్ వద్దకు వెళ్లనీయలేదు. అతి కష్టం మీద వారిని నెట్టుకుం టూ వెళ్లి జరిగిన విషయం అల్లు అర్జున్‌కు చెప్పా. మీకు అధికారులంతా రూట్ క్లియర్ చేస్తారు.
దయచేసి ఇక్కడి నుంచి ఖాళీ చే యండి అని చెప్పా. సినిమా చూసిన తర్వాతే వెళ్తానని ఆయన పేర్కొన్నారు. వెంటనే డీసీపీకి చెప్పాం. ఆయన.. మేము లోపలికి వచ్చి 10 నిమిషాలు సమయం ఇచ్చాం. ఆ తర్వాత అల్లు అర్జున్‌ను బయటకు తీసుకొ చ్చాం. మేం లోపలికి వెళ్లే వీడియోలు ఉన్నా యి. అల్లు అర్జున్‌తో మాట్లాడే ఫుటేజ్ కో సం ప్రయత్నించినా దొరకలేదన్నారు.
తొక్కిసలాటలో చనిపోతాననుకున్నా: రాజు నాయక్, చిక్కడపల్లి ఎస్‌హెచ్‌వో
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో తాను కూడా చనిపోతానేమోనని అ నుకున్నట్లు చిక్కడపల్లి ఎస్‌హెచ్‌వో రాజు నా యక్ పేర్కొన్నారు. రేవతి మృతి బాధకారమ ని, శ్రీతేజ్ ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని కోరుకుంటున్నానంటూ కన్నీరు పెట్టుకున్నా రు. ఆరోజు అల్లు అర్జున్ వద్దకు మేం వెళ్లేందుకు ప్రయత్నించినా ఆయన మేనేజర్ ఒ ప్పుకోలేదని, అక్కడి నుంచి వెళ్లకపోతే పరిస్థితి చేయి దాటిపోతుందని చెప్పామన్నారు.