- సీఎం రేవంత్‌రెడ్డితోనే పాలమూరు అభివృద్ధి
- అతి త్వరలోనే అయిజ మార్కెట్ ఏర్పాటు
- మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారంలో మంత్రి తుమ్మల
- వ్యవసాయం పండుగలా చేస్తున్నాం : మంత్రి జూపల్లి
వనపర్తి, సెప్టెంబర్ 13 ( విజయక్రాంతి)/అలంపూర్: ఎన్నికల్లో ఓడిపోయినా సంపత్ కుమార్ ఎప్పటికీ శాసనసభ్యుడేనని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వంతో క లిసి అలంపూర్ అభివృద్దికి ఎల్లప్పుడు అండ గా ఉంటామని చెప్పారు. గద్వాల జిల్లా అల ంపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో శు క్రవారం నూతన కమిటీ ప్రమాణ స్వీకార కా ర్యక్రమానికి ఎక్సైజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి తుమ్మల హాజరయ్యారు. ముందుగా అలంపూర్ జోగుళాం బ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.
అన ంతరం యార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన సమావేశంలో తుమ్మల మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా నిరంతరం అలంపూర్ నియోజకవర్గం కోసం తన్లాడే వ్యక్తి సంపత్ కుమార్ అని అన్నారు. పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డిని సీఎం గా చేసిన ఘనత కాంగ్రెస్ పార్టిదేనని, ఆయనతోనే పా లమూరు అభివృద్ది పరుగులు పెడుతుందని చెప్పారు. జోగుళాంబ అమ్మవారి సాక్షిగా రే వంత్‌రెడ్డి రుణమాఫి చేస్తామని ప్రమాణం చేసి.. మాట నిలబెట్టుకున్నారని చెప్పారు. మిగిలిన కొందరికి కూడా రుణమాఫి చేస్తామని స్పష్టంచేశారు. త్వరలో అయిజలో మార్కెట్ ఏర్పాటు చేస్తామని మంత్రి వెల్లడించారు.
వ్యవసాయం పండుగలా మార్చేందుకు పని చేసున్నాం: మంత్రి జూపల్లి
తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ ఆశీస్సులతో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన వ్యవ సాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఆధ్వర్యంలో వ్యవసాయాన్ని పండుగలా చే సే విధంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గత ప్రభుత్వం శ్రీశైలం ముంపు బాధితుల స మస్యలను విస్మరించిందని..సీఎం రేవంత్ రె డ్డితో చర్చించి సమస్యలకు పరిష్కార దిశగా పనులు చేయడం జరుగుతుందన్నారు.
ఫిరాయింపుల విషయంలో బీఆర్‌ఎస్ నాయకులు పలుకుతున్న నీతి వ్యాఖ్యలు వాళ్ల హ యాంలో జరిగిన ఫిరాంపుల సమయంలో ఏమయ్యాయని ప్రశ్నించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బింగిదొడ్డి దొడ్డప్ప, వైస్ చైర్మన్ పచ్చర్ల కుమార్ గౌడ్, డైరెక్టర్లతో ప్రమాణ స్వీకారంచేయించారు. సమావేశం లో హైదరాబాద్ డివిజన్ మార్కెట్ రీజనల్ డిప్యూటి డైరెక్టర్ ప్రసాదరావు, కలెక్టర్ సం తోష్, ఎస్పీ శ్రీనివాస రావు, జిల్లా మార్కెటి ంగ్ శాఖ అధికారి పుష్ఫమ్మ, ఆర్డీవో రాంచందర్, సెక్రటరీ ఎల్లస్వామితదితరులు పాల్గొన్నారు.