calender_icon.png 4 March, 2025 | 12:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసీబీకి చిక్కినా.. తీరు మారలే..

04-03-2025 12:22:58 AM

నిజామాబాద్‌లో ఏసీబీకి దొరికిన నిర్మల్ వాసి

నిర్మల్ మార్చి 3 (విజయక్రాంతి) : నిర్మల్ జిల్లాకు చెందిన సబ్ రిజిస్టర్ రామరాజు గతంలో ఏసీబీకి దొరికిన తీరు మార్చుకోకపోగా రెండోసారి ఏసీబీకి చిక్కిన ఘటన జిల్లాలో తీవ్ర చర్చనీయకంగా మారింది. నిర్మల్ జిల్లా కేంద్ర తో పాటు బైంసా బూత్ సబ రిజిస్టర్ కార్యాలయంలో విధులు నిర్వహించిన శ్రీ రామరాజు పలుసార్లు అక్రమాలకు అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.

బైంసాలో ఒక రిజిస్ట్రేషన్ విషయంలో ఈయనపై ఆరోపణలు రావడంతో అప్పటి ప్రభుత్వం ఈరను బైంసా నుండి బోత్ కు బదిలీ చేసింది. అక్కడ విధులు నిర్వహిస్తున్న రిజిస్ట్రేషన్ కోసం ఓ రైతు వద్ద ఐదువేల లంచం తీసుకుంటూ దొరికారు. ఆ తర్వాత కోర్టులు విచారణ జరుగుతుండగానే సబ్ రిజిస్టర్ ఉన్నత అధికారుల తో సంప్రదింపులు నిర్వహించి తిరిగి పోస్టింగులు తెచ్చుకున్నారు.

ఆయనను ఇటీవలే నిజామాబాదుకు బదిలీ చేయగా అక్కడ రెండో సబ్ రిజిస్టర్ గా విధులు నిర్వహిస్తున్న రామరాజు సోమవారం 10,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కడంతో ఆయన పై తీవ్ర చర్చ జరుగుతోంది. 20 సంవత్సరాలుగా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో పనిచేశారు.