- తగ్గని రేషన్ బియ్యం స్మగ్లింగ్
- ప్రతి నెలా వేల టన్నులు పక్కదారి పడుతున్న వైనం
- అధికారులు, డీలర్ల కుమ్మక్కు
- పోలీసులకు దొరికినా యథేచ్ఛగా దందా నిర్వహణ
కామారెడ్డి, ఆగస్టు 30 (విజయక్రాంతి): ప్రభుత్వం హెచ్చరిస్తున్నా.. అధికారులు నిఘా పెడుతున్నామని చెప్తున్నా రేషన్ బియ్యం అక్రమ రవాణా ఆగట్లేదు. ప్రతి నెలా టన్నుల్లో పక్కదారి పడుతూనే ఉన్నాయి. నియంత్రించాల్సిన అధికారులే నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండటంతో అక్రమ దందా మూడు లారీలు.. ఆరు లోడ్లుగా సాగుతోంది. అధికారులు, డీలర్లు కుమ్మక్కవ్వడంతో తమకు ఎదురేలేదన్నట్టు చెలరేగిపోతున్నారు. ప్రతి నెలా ప్రభుత్వం లబ్ధిదారులకు ఒకరికి ఆరు కిలోల చొప్పున ఉచితంగా రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తుంది.
జిల్లా కేంద్రంతో పాటు మండల కేంద్రాలు, గ్రామాల్లో రేషన్ బియ్యం సేకరణ కోసం ప్రత్యేకంగా మనుషులను నియమించుకొంటున్నారు. కిలోకు రూ.10 నుంచి రూ.15 వరకు చెల్లించి మరీ కొనుగోలు చేస్తున్నారు. ఆ బియ్యాన్ని రీస్లుకి ంగ్ చేసి రూ.50 నుంచి రూ.60 చొప్పున విక్రయిస్తున్నారు. కిలోకు రూ.30 నుంచి రూ.40 ఆదాయం లభించడమే కాకుండా మళ్లీ రేషన్ షాపులకు, హాస్టళ్లకు అవే బి య్యాన్ని సన్నబియ్యం పేరుతో ఆంటగడుతున్నారు. దీనిగురించి తెలిసినా తెలియద న్నట్టు అధికారులు వ్యవహరిస్తున్నారు.
పట్టుబడినా వదలకుండా..
రేషన్ డీలర్లు, మధ్య దళారులు రేషన్ బియ్యాన్ని తరలించేటప్పుడు విజిలెన్స్ అధికారులకు, పోలీసులకు పట్టుబడుతున్నారు. పట్టుబడిన బియ్యాన్ని వదిలేని.. ఆ తర్వాత యథావిధిగా పని కానిచ్చేస్తున్నారు. బలమైన కేసులు కాకపోవడంతో స్మగ్లర్లు దందాను యథేచ్చగా కొనసాగిస్తున్నారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని ఓ వ్యాపారస్థుడు పీడీఎస్ బియ్యం కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు చేరవేయడమే పనిగా పెట్టుకున్నాడు. పేదల అవసరాలను ఆసరాగా చేసుకుంటూ బియ్యాన్ని లబ్ధిదారుల నుంచి సేకరిస్తున్నా రు. కిలోకు రూ.18 చెల్లించి మరీ కొంటున్నారు. కాగా, ఇటీవల పోలీస్, సివిల్ సప్లు ఆధ్వర్యంలో సంయుక్తంగా దాడులు నిర్వహించి 15 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకొని నలుగురిపై కేసు నమోదు చేశారు. అయినా దందా ఆగకపోవటం గమనార్హం.
రేషన్ బియ్యం అమ్మినా, కొన్నా నేరమే
రేషన్ బియ్యం అమ్మిన కొన్న నేర మే. పీడీఎస్ బియ్యం సేకరించిన వారి పై చర్యలు తీసుకుంటాం. ఎవరైనా రేష న్ బియ్యం కొనుగోలు చేస్తే పోలీసుల కు సమాచారం ఇవ్వాలి. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతాం.
ఎస్పీ, కామారెడ్డి