- అసంపూర్తిగా భీమారం- సూర్యాపేట రోడ్డు పనులు
- కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే కారణమని ఆరోపణలు
- ప్రమాదాల బారిన వాహనదారులు
- పట్టించుకోని అధికారులు, పాలకులు
నల్లగొండ, ఫిబ్రవరి 3 (విజయక్రాం తి): నల్లగొండ - సూర్యాపేట జిల్లాలను అనుసంధానించే భీమారం- సూర్యాపేట రహదారి నిర్మాణ పనులు ప్రారంభమై పదేండ్లు కావొస్తున్నా ఇంకా పూర్తి కావడం లేదు. పనులు నత్తనడకన సాగుతున్న కారణంగా ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఈ రహదారిపై ప్రయాణమంటేనే దీంతో వాహనదారులు, ప్రయాణికులు జంకుతు న్నారు.
సూర్యాపేట నుంచి భీమారం మీదుగా వేములపల్లి మండలం శెట్టిపాలెం శివారులోని అద్దంకి- నార్కెట్‌పల్లి వరకు 28 కిలోమీటర్ల మేర రెండు లేన్ల రహదారి నిర్మాణానికి నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. 2015లో టెండర్ల ప్రక్రియ ను పూర్తి చేసి 2016లో కేఎంఆర్ గ్రూప్స్ కు పనులు అప్పగించింది.
రెండు వితలు.. రూ.44 కోట్లు..
ఈ రోడ్డు నిర్మాణానికి రెండు విడతలు గా ప్రభుత్వం రూ. 44 కోట్ల కేటాయించిం ది. తొలి విడత రూ. 24 కోట్లు, రెండో విడత రూ.20 కోట్లు మంజూరు చేసింది. కానీ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా ఇప్పటివరకు పనులు పూర్తి కాలేదు. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పూర్తికాని కల్వర్టుల నిర్మాణం..
రహదారిపై చాలాచోట్ల కల్వర్టు పనులు పెండింగ్‌లో ఉన్నాయి. చిన్నపెద్ద యాభైకి పైగా కల్వర్లులు నిర్మించాల్సి ఉండగా ఇప్పటికీ 20పైగాపెండింగ్‌లో ఉన్నాయి. పూర్తయిన కల్వర్టులకు ఇరువైపులా మట్టి పోయకపోవడంతో ప్రయాణికులు అప్రో రోడ్డుపై ప్రయాణించాల్సి వస్తున్నది.
రహ దారి పొడవునా చాలాచోట్ల రోడ్డు తవ్విన కారణంగా మోకాల్లోతు గుంతలు ఉండ డంతో రాత్రివేళ ప్రమాదాలు జరుగు తున్నాయి. పలుచోట్ల కంకర పరిచి బీటీ వేయకపోవడంతో వాహనదారులు అవస్థ పడుతున్నారు. 30 కిలోమీటర్ల ప్రయాణా నికి దాదాపు గంట న్నరకు పైగా సమయం పడుతున్నది. రహదారి నిర్మాణం పూర్తయి తే 50 నిమిషా ల్లోపే చేరుకోవచ్చు.