11-02-2025 01:33:21 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 10 (విజయక్రాంతి): ‘పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై తెలంగాణ స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారు ? పది నెలల సమయం సరిపోలేదా ? అసెంబ్లీ గడువు ముగిసే వరకు కాలయాపన చేస్తారా ? లేదా డిక్షనరీలో రీజనబుల్ సమయానికి ఏదైనా నిర్ణీత సమయం రాసి ఉందా ? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం.
మరో రెండు వారాల గడువంటే కుదరదు’ అంటూ సుప్రీం కోర్టు సోమవారం తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ తరఫు అడ్వొకేట్ ముకుల్ రోహిత్గీపై అసహనం వ్యక్తం చేసిం ది. పై విచారణను ఈ నెల 18 వాయిదా వేసింది. బీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేలుగా గెలిచి, పార్టీ ఫిరాయించిన ఎమ్మె ల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్, దానం నాగేందర్‌పై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్‌ఎల్పీ) దాఖలు చేశారు.
అలాగే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎం.సంజ య్‌కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ప్రకాశ్ గౌడ్, గూడెం మహిపా ల్‌రెడ్డి, అరెకపూడి గాంధీపై చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మె ల్యే కేటీఆర్, ఎమ్మెల్యే హరీశ్‌రావు రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్లపై జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కె.వినోద్ చంద్రన్‌తో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ముందుగా అసెంబ్లీ సెక్రటరీ తరఫు అడ్వొకేట్ ముకుల్ రోహిత్గీ తన వాదనలు వినిపిస్తూ.. కేవలం ఫిర్యాదులే కాకుం డా, స్పీకర్ ఇతర పనులు కూడా చూడాల్సి ఉంటుందని, ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని తమకు మరో రెండు వారాల గడువు కావాలని ధర్మాసనాన్ని కోరారు.
తర్వాత పిటిషనర్ల తరఫు అడ్వొకేట్ అర్యమ సుందరం వాదనలు వినిపిస్తూ.. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం 10వ షెడ్యూల్ ప్రకారం పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్దిష్ట గడువులోపు చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని, స్పీకర్ మీనమేషాలు లెక్కించడానికి వీల్లేదన్నారు.
మూడు నెలల్లోపు పార్టీ ఫిరాయింపుల ఫిర్యాదులు పరిష్కరించాలని సుప్రీం కోర్టు గతంలోనే ఉత్తర్వులు జారీ చేసిందని గుర్తుచేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం విచార ణను ఈ నెల 18 వాయిదా వేసింది. అప్పటి లోపు పార్టీ ఫిరాయింపులపై స్పీకర్‌ను సంపద్రించి, న్యాయస్థానానికి తెలపాలని ఆదేశించింది.