10-04-2025 02:36:44 AM
అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థుల్లో ఆందోళన
ట్రంప్ విధానాలు ప్రతికూలంగా మారిన వైనం
ట్రాఫిక్ ఉల్లంఘన, వాహనం వేగంగా నడిపినా కఠిన చర్యలు
న్యూయార్క్, ఏప్రిల్ 9: అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలని కలలు కం టున్న విదేశీ విద్యార్థులకు తాజాగా పరిస్థితులు అనుకూలంగా లేవు. ఒకప్పుడు ఎం తో ఆశావహంగా కనిపించిన అమెరికా కల ఇప్పుడు ఆందోళనలు, భయాలతో నిండిన పీడకలగా మారుతోంది. డొనాల్డ్ ట్రంప్ రెం డోసారి అమెరికాకు అధ్యక్షుడిగా వచ్చాకా మారిన పరిస్థితులు, కొత్త విధానాలు, కఠినమైన వీసా నిబంధనలు, పెరుగుతున్న జీవ న వ్యయం, ఉద్యోగ అవకాశాలు తగ్గిపోవ డం వంటి కారణాల వల్ల విదేశీ విద్యార్థులు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. దీనికి భారతీయ విద్యార్థులు అతీతులేం కాదు. ఎందుకంటే అమెరికాలో విద్యను అభ్యసిస్తున్న వారిలో భారతీయులే ఎక్కువగా ఉన్నారు.
ట్రంప్ అధ్యక్షుడయ్యాకా అమెరికా లో పరిస్థితుల్లో పూర్తిగా మార్పు వచ్చింది. చిన్న చిన్న కారణాలకే వీసా రద్దు చేస్తుండడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నా రు. తాజాగా అమెరికాలో విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు అందించే ఎఫ్| వీసా నిబంధనలు మరింత కఠినం కానున్నాయి. విదేశీ విద్యార్థులు స్టూడెంట్ అండ్ ఎక్సేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ (ఎస్‌ఈవీపీ) కింద సర్టిఫైడ్ స్కూళ్లలో విద్యను అభ్యసించేందు ఎఫ్‌బె వీసాలు జారీ చేస్తారు. అయి తే ఎఫ్ వీసా సమ్మతిని కొనసాగించడానికి కొన్ని షరతులు తప్పనిసరిగా పాటిం చాల్సిందే.
ఉద్యోగాల విషయంలోనూ నిరాశే
ఉద్యోగాల విషయంలోనూ నిరాశే ఎదురవుతోంది. చదువు పూర్తయిన తర్వాత ఉద్యో గం పొందడం అంత సులభం కాదు. వీసా నిబంధనలు కఠినంగా ఉండటం, కంపెనీలు విదేశీయులను నియమించడానికి వెనుకాడ టం వంటి కారణాల వల్ల ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నాయి. దీంతో చాలా మంది విద్యార్థులు చదువు పూర్తి చేసుకొని స్వదేశానికి తిరిగి వెళ్లాల్సి వస్తోంది. కేంద్రం సహాయం చేయడానికి చర్యలు తీసుకోవాలని భారతీయ విద్యా ర్థులు కోరుతున్నారు.
ఇలా అయితే భవిష్యత్తు అంధకారమే
అతి వేగంగా వాహనం నడిపినా, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించినా, సామాజిక మాధ్యమంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టినా.. ఇలా చిన్న చిన్న తప్పులు చేసినా వీసా రద్దు చేయడంపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే తమ భవిష్యత్తు అంధకారమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
భారత విద్యార్థులపైనే అధిక ప్రభావం
అమెరికాలో కొన్ని కళాశాలలు అంతర్జాతీయ విద్యార్థుల వీసాల రద్దకు సంబంధించిన సంఘటనలు పెరుగుతున్నాయని ధృవీకరించాయి. ముఖ్యంగా భారతీయ విద్యార్థులపై అధిక ప్రభావం పడుతున్నట్టు తెలుస్తోంది. పేలవమైన విద్యా పనితీరు లేదా క్రమశిక్షణా కారణాల వల్ల వీసా రద్దు చేయడం కనిపి స్తోంది. పార్ట్‌టైమ్, హైబ్రీడ్ లేదా ఆన్‌లైంట్ వంటి కోర్సులకు మారినప్పుడు ఆ విషయాన్ని సెవీస్ (SEVIS)కు వెల్లడించకపోయినా వీసా రద్దు చేస్తున్నారు. అమెరికాలో చదువుకోవడం చాలా ఖరీదైన వ్యవహారం. ట్యూషన్ ఫీజులు, వసతి ఖర్చులు, ఆహార ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీనివల్ల చాలా మంది విద్యార్థులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.