calender_icon.png 9 January, 2025 | 11:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిమిషం ఆలస్యమైనా పరీక్ష రాయడానికి అనుమతి లేదు

13-12-2024 04:41:02 PM

జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ వెల్లడి...

నిర్మల్ (విజయక్రాంతి): ఈనెల 15 16 తేదీల్లో టీజీపీఎస్సీ ద్వారా నిర్వహించే గ్రూప్-2 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు నిర్ణిత సమయంలోనే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పరీక్ష రాసే అభ్యర్థులకు 24 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొత్తం 8080 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నట్లు వివరించారు. పరీక్ష రాసి అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు అరగంట ముందుగానే చేరుకోవాలని సూచించారు. ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదని పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఆమె పేర్కోన్నారు. పరీక్షలను ఉదయం సాయంత్రం వేళలో రెండు పేపర్లను నిర్వహించడం జరుగుతుందని అభ్యర్థులు హాల్ టికెట్లు గుర్తింపు కార్డులతో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని ఆమె సూచించారు.