27-03-2025 12:00:00 AM
అందించిన వాఘ్ బక్రీ ఫౌండేషన్
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 26 (విజయక్రాంతి): హైదరాబాద్, నెల్లూరులోని 205పైగా ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్న అక్షయపాత్ర ఫౌండేషన్‌కు వాఘ్ బక్రీ ఫౌండేషన్ వారు ప్రత్యేకంగా రూపొందించిన 9 కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను అందజేశారు.
బుధవారం ప్రముఖ టీవీ యాంకర్ సుమ కనకాల, వాఘ్‌బక్రీ టీ గ్రూప్ సీఈవో సంజయ్‌సింగ్, సీనియర్ ఉపాధ్యక్షుడు యోగేశ్‌శిండే, దక్షిణ విభాగం అధిపతి పీవీ సురేష్, సీఎస్‌ఆర్ హెడ్ అజయ్ సిసిలియా, అక్షయపాత్ర ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు యాగ్నేశ్వర్‌దాస్‌లు ప్రారంభించారు.
ఈ సందర్భంగా అక్షయపాత్ర ఫౌండేషన్ తెలంగాణ, ఏపీ, ప్రాంతీయ అధ్యక్షుడు సత్యగౌరచంద్రదాస్ మాట్లాడుతూ.. వాఘ్ బక్రీ ఫౌండేషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. వాఘ్ బక్రీ సీఈవో సంజయ్ సింగాల్ మాట్లాడుతూ అక్షయపాత్ర ఫౌండేషన్ భాగస్వామ్యంతో వేలాదిమంది విద్యార్థులకు సహకారం అందించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. సుమ కనకాల మాట్లాడుత వాఘ్ బక్రీ టీ గ్రూప్ సేవ కార్యక్రమాన్ని ప్రశంసించారు.