తొలి రోజు 131 వాహనాలు రిజిస్ట్రేషన్
హైదరాబాద్,నవంబర్18(విజయ క్రాంతి) : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ఈవీ పాలసీ సోమవారం నుంచి అమల్లోకి వచ్చిం ది. తొలి రోజు రాష్ట్రవ్యాప్తంగా 131 వాహనాలను వినియోగదారులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ రిజిస్ట్రే షన్లను ఆర్టీఏ అధికారులు ఉచితంగా చేశారు. 131 వాహనాల్లో ఆటో రిక్షా లు 3, గూడ్స్ క్యారేజీ 1, కార్లు 6, బైక్ లు 121 ఉన్నాయని జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ రమేశ్ విజయక్రాంతికి వెల్లడించారు.
జీరో రిజిస్ట్రేష న్ ఫీజుతో వాహనదారులు ఖుషీ అవుతున్నారు. ఈవీ పాలసీ వల్ల ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గుతున్న నేప థ్యంలో వాటిని కొనే వారి సంఖ్య పెరుగుతోందని.. ఫలితంగా కాలు ష్యం తగ్గే అవకాశం ఉందని రవాణా శాఖ అంచనా వేస్తోంది.