* ఏర్పాటు చేయనున్న హ్యుందాయ్
ముంబై: హ్యుందాయ్ మోటర్ ఇండి యా వచ్చే ఏడేళ్లలో దేశవ్యాప్తంగా దాదా పు 600 పబ్లిక్ ఈవీ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టు కుంది. 2024 డిసెంబర్ చివరి నాటికి 50 ఫాస్ట్ పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ల నెట్‌వర్క్‌ను కలిగి ఉంటుందని కంపెనీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. 2030 నాటికి ఈవీ మార్కెట్ దేశవ్యాప్తంగా వృద్ధి చెందుతుందని భావిస్తున్నట్లు హ్యుందాయ్ మోటర్ ఇండియా ఫంక్షన్ హెడ్ - కార్పొరేట్ ప్లానింగ్ ‘జే వాన్ ర్యూ’ తెలిపారు. ప్రస్తుతం ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం వల్ల హైవేలపై సుదూర ప్రయాణా లు చేసే ఎలక్ట్రిక్ వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
దీన్ని దృష్టిలో ఉంచుకుని కీలకమైన హైవేలపై ఫాస్ట్ ఈవీ ఛార్జర్లను ఇన్‌స్ట్టాల్ చేయడానికి హ్యుందా య్ మోటార్స్ చొరవ తీసుకుంటోందని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. హ్యుందాయ్‌కు సంబంధించిన ఫాస్ట్ ఛార్జీంగ్ స్టేష న్లు అన్ని బ్రాండ్ల ఎలక్ట్రిక్ కార్ల వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి. 2027 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 100 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు తమిళనాడు ప్రభుత్వంతో హ్యుందాయ్ సంస్థ ఎంఓయూ పై సంతకం చేసింది. వాటిలో 10 స్టేషన్లు ఈ ఏడాది పూర్తయ్యేలోపు పనిచేయనున్నాయి.
హ్యుందాయ్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు..గురుగ్రాం, ముంబై, పూణే, బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్, చెన్నై వంటి నగరాల్లో వ్యూహాత్మ కంగా ఉన్నాయి. ఢిల్లీ-చండీగఢ్, -జైపూర్, హైదరాబాద్‌విజయవాడ,ముంబై-పుణే, ముంబై-సూరత్, బెంగళూరు-పుణే, పుణే -కొల్హాపూర్‌తో సహా ప్రధాన రహదారులపై ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడం ద్వారా కంపెనీ ఇప్పటికే పాన్-ఇండియా నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసింది.