హైదరాబాద్, నవంబర్ 15 (విజయక్రాంతి): మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్‌లో ఏర్పాటు చేసిన నూతన మోడిఫైడ్ గూడ్స్ షెడ్ నుంచి గూడ్స్ ద్వారా ఈవీ ఆటోలను తొలిసారిగా రవాణా చేశారు. ఢిల్లీకి ఈ ఈవీ ఆటోలను తరలించారు. ఈవీ ఆటోల ట్రాన్స్‌పోర్టేషన్ ద్వారా దక్షిణ మధ్య రైల్వేకు రూ17.5 లక్షల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు.
జడ్చర్ల సమీపంలోని రాజాపూర్‌లో ప్లాంట్‌ను కలిగి ఉన్న కేఈటీవో మోటార్ కంపెనీ బాలానగర్ స్టేషన్ నుంచి గూడ్స్ ద్వారా తొలి సారిగా రవాణా సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకుందని రైల్వే అధి కారు లు తెలిపారు. ఆటోమొబైల్ పరిశ్రమకు అనుకూలంగా నూతన గూడ్స్ రైళ్లను సిద్ధం చేసినట్టు హైదరాబాద్ డీఆర్‌ఎం లోకేశ్ విష్ణోయ్ తెలిపారు.