ఈ నెల 6 నుంచి 15వ తేదీ వరకు జరగనున్న ‘29వ యూరోపియన్ యూనియన్ ఫిల్మ్ ఫెస్టివల్’కు రాష్ట్ర రాజధాని వేదిక కానుంది. హైదరాబాద్ ఫిలిం క్లబ్ సారథ్యంలో ౧౦ రోజులపాటు నగరంలోని ప్రసాద్ ల్యాబ్స్ ఈ వేడుకను నిర్వహించనున్నారు. బుధవారం ఏర్పాటుచేసిన ప్రెస్‌మీట్‌లో నిర్వాహకులు వేడుక వివరాలను వెల్లడించారు. తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీరశంకర్, సీనియర్ దర్శకుడు రేలంగి నరసింహారావు మాట్లాడుతూ.. ‘వివిధ భాషల ఫిల్మ్ ఫెస్టివల్స్‌కు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సహకారం అందించాలి’ అని అన్నారు.
‘యూరోపియన్ యూనియన్‌లోని వివిధ దేశాలకు చెందిన 29 భాషల్లో అవార్డులు గెలుచుకున్న 24 చిత్రాలను ప్రదర్శిస్తాం’ అని హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ ప్రెసిడెంట్ కేవీ రావు తెలిపారు. ఆ క్లబ్ సెక్రటరీ ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘ఎలాంటి డెలిగేట్ పాస్‌లు లేకుండా ప్రేక్షకులకు ఆహ్వానిస్తున్నాం’ అని చెప్పారు. కరీంనగర్ ఫిల్మ్ సొసైటీ ప్రెసిడెంట్ పొన్నం రవిచంద్ర, తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ సెక్రటరీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు.