calender_icon.png 21 October, 2024 | 6:04 PM

జీవాన్వేషణలో యూరోపా పరుగు

21-10-2024 12:00:00 AM

  1. ఆసక్తికరంగా నాసా జుపిటర్ మిషన్
  2. భూమికి మించిన జీవితం కోసం అన్వేషణ

న్యూఢిల్లీ, అక్టోబర్ 20: భూమికి ఆవల జీవాన్వేషణలో భాగంగా జుపిటర్, చంద్రుడిపై పరిశోధించడానికి నాసా ఓ అధ్బుతమైన మిషన్‌ను ప్రారంభించింది. దాని పేరే జుపిటర్ మిషన్. 2024 అక్టోబర్ 14న నాసా ఆధ్వర్యంలో కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్ ఎక్స్ ఫాల్కన్ హెవీ రాకెట్‌లో ఈ వ్యోమనౌకను ప్రారంభించారు.

ఈ మిషన్ ఖర్చు దాదాపు 5.2 బిలియన్ డాలర్లు. ఇది దాదాపు ఆరేళ్లపాటు దాదాపు 2 బిలియన్ కిలోమీటర్లు ప్రయాణించి దాని గమ్యాన్ని చేరుకుంటుంది. ఇది దాదాపు 2030 ఏప్రిల్‌లో జుపిటర్ వద్దకు చేరుకొని తన పనిని ప్రారంభిస్తుంది.  ఈ మిషన్ గురించి నాసా ప్రోగ్రామ్ సైంటిస్ట్ కర్ట్ నీబర్ మాట్లాడుతూ..

‘మేము బిలియన్ల సంవత్సరాల క్రితం నివాసయోగ్యమైన ప్రపంచాన్ని అన్వేషిం చడంతో పాటు ప్రస్తుతం అంతరిక్షంలో నివాసయోగ్యమైన మరో ప్రపంచం కోసం అన్వేషిస్తున్నాం’ అని అన్నారు. క్లిప్పర్ మిషన్ ద్వారా మంచుతో నిండిన చంద్రుడి గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు.