calender_icon.png 29 October, 2024 | 12:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యుఫోరియా షురూ

02-07-2024 12:05:00 AM

ఎన్నో గొప్ప సినిమాలతో వెండితెర ప్రేక్షకుల మదిలో తనకంటూ ఓ స్థానాన్ని పదిలపర్చుకున్న సీనియర్ చిత్ర దర్శకుల్లో గుణశేఖర్ ఒకరు. చివరిసారి ‘శాకుంతలం’తో సినీ ప్రియులను పలుకరించిన ఆయన కొన్ని నెలల పాటు విరామం తీసుకున్నారు. ఓ కొత్త కాన్సెఫ్ట్‌తో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు ఆయన ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అదే ‘యుఫోరియా’. టైటిల్‌తోనే ఆసక్తి రేకెత్తించిన గుణశేఖర్ తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు ప్రారంభించే క్రమంలో సోమవారం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ‘గుణ హ్యాండ్ మేడ్ ఫిలిమ్స్’పై  ఈ చిత్రాన్ని నీలిమా గుణశేఖర్ నిర్మిస్తున్నారు. కాలభైరవ సంగీత సారథ్యం వహిస్తున్నారు. నటీనటులు తదితర వివరాలను త్వరలో తెలియనున్నాయి.